Begin typing your search above and press return to search.

భ‌ర్త ఏమంటాడో అని భ‌య‌ప‌డుతోంది

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:30 AM GMT
భ‌ర్త ఏమంటాడో అని భ‌య‌ప‌డుతోంది
X
మేరా నామ్ మేరీ .. అంటూ హాట్ హాట్‌ గా ఆడిపాడింది క‌రీనా క‌పూర్‌. పెళ్ల‌యిన ఆంటీ మ‌రీ ఇంత ఘాటు గా ఎక్స్‌పోజ్ చేసిందే అంటూ కామెంట్స్ వినిపించాయి. ఎక్స్‌పోజింగ్‌ లోనే కాదు పెద‌వి ముద్దులు ముంచెత్త‌డం లో, బెడ్‌రూమ్ స‌న్నివేశాల్లోనూ ఈ అమ్మ‌డి పై ఇప్పుడు హాట్ డిష్క‌స‌న్ సాగుతోంది.

బెబో క‌రీన పెళ్ల‌యిన ఆంటీ అన్న సంగ‌తినే మ‌ర్చిపోయి న‌వ‌త‌రం హీరోల‌ తో రొమాన్స్‌ లో జీవించేయ‌డం, అద‌ర‌ చుంబ‌నాల్లో ఇర‌గ‌దీయ‌డం బాలీవుడ్‌ లో పెద్ద రేంజు లో చ‌ర్చ‌కొచ్చింది. లేటెస్టు గా ఆర్. బాల్కీ ద‌ర్శ‌క‌త్వం లోని కై అండ్ కా అనే చిత్రం లో క‌రీన ఘాటైన అద‌ర‌చుంబ‌నాల్లో పాల్గొంద‌ని, ఇంటిమేట్ సీన్స్‌లో న‌టించింద‌ని చెబుతున్నారు. అయితే ముందు గా ఇలాంటి సీన్స్‌లో న‌టించేసింది కానీ, ఆ త‌ర్వాత ఆ సీన్స్ తెర‌పై క‌నిపిస్తే కాపురం కొల్లేరు అవుతుంద‌ని భ‌య‌ప‌డిందో ఏమో.. ఇప్పుడు ఆ సీన్స్‌ని సినిమా నుంచి తొల‌గించాల్సింది గా డైరెక్ట‌ర్‌ని కోరుతోందిట‌.

ఈ చిత్రంలో కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్‌ తో ఓ రేంజు లో రోమాంచిత స‌న్నివేశాల్లో న‌టించిన ఈ ఆంటీగారు .. కేవ‌లం సైఫ్‌ని ఇబ్బంది పెట్ట‌లేకే ఇలా చేస్తోందా? అన్న‌ది ఇప్పుడో టాపిక్‌. కాని పెళ్ళయిన వెంటనే ఎక్స్‌పోజింగ్‌ కటిఫ్‌ అనడం.. మళ్ళీ డోస్‌ పెంచడం.. ఇప్పుడు ప్చ్‌ అనడం.. ఏంటో ఈవిడగారి స్టయిలు మరి..