Begin typing your search above and press return to search.

'వీరే ది వెడ్డింగ్' భామల బికినీ రచ్చ

By:  Tupaki Desk   |   18 May 2018 8:02 AM GMT
వీరే ది వెడ్డింగ్ భామల బికినీ రచ్చ
X
బాలీవుడ్ లో ఎలాంటి మార్పులు వస్తున్నా నటిమణుల్లో మాత్రం పెద్దగా మార్పులు రావడం లేదు. ముఖ్యంగా హాట్ స్టిల్స్ ఇవ్వడంలో పద్ధతులు ఏ మాత్రం మారడం లేదు. యువ హీరోయిన్స్ గా ఉన్నప్పుడు బికినిలో స్టిల్స్ ఇచ్చారు అంటే ఈ కాలంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వయసు ఎంత మరినప్పటికి నటీమణులు ఇంకా పదహారేళ్ల పడుచు యువతుల్లానే అందాలను ఆరబోస్తున్నారు.

మూడు పదుల వయసు దాటినా కూడా హీరోయిన్స్ లలో పెద్దగా మార్పు రావడం లేదు. ఇక రీసెంట్ గా కరీనా కపూర్ - సోనమ్ కపూర్ ఇద్దరు కలిసి ఒకేసారి అభిమానులకు షాక్ ఇచ్చారు. వీరిద్దరూ బాలీవుడ్ లో తెరకెక్కిన 'వీరే ది వెడ్డింగ్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా బికినీ టాపుల్లో సోనమ్ కపూర్ అండ్ కరీనా రచ్చ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే స్వర భాస్కర్ అండ్ శిఖా తల్సానియా కూడా తమ వంతుగా సింగిల్ పీస్ బికినీల్లో సోకులు ఆరబోశారు. పిచ్చెక్కిస్తున్నారు అంటూ నెటీజన్స్ కామెంట చేయడం వైరల్ గా మారింది.

రీసెంట్ గా సోనమ్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జూన్ 1న విడుదల కాబోతోన్న వీరే ది వెడ్డింగ్ సినిమా కోసం ప్రస్తుతం బాలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్నారు. కరీనా కూడా సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించడం హైలెట్ గా చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.