Begin typing your search above and press return to search.

కరణ్ మాట రాజమౌళి పట్టించుకుంటాడా?

By:  Tupaki Desk   |   30 July 2015 1:56 PM GMT
కరణ్ మాట రాజమౌళి పట్టించుకుంటాడా?
X
బాహుబలి సినిమాకు సంబంధించి కరణ్ జోహార్ కు రెండు విషయాల్లో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం కరణ్ జోహారే అని చెప్పాలి. అతనే కనుక బాహుబలి సినిమాను విడుదల చేయకుంటే నార్త్ జనాలకు ఈ సినిమా చేరువయ్యేది కాదు. ఇక రెండో థ్యాంక్స్ ఎందుకంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ జులై 10నే సినిమా విడుదల చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ని ప్రెజర్ పెట్టి సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యేలా చూసినందుకు. నిజానికి విడుదల విషయంలో హడావుడి ఎందుకంటూ ఓ దశలో సినిమాకు ఆగస్టుకు వాయిదా వేద్దామని చూశాడట జక్కన్న. కానీ బాలీవుడ్లో రిలీజ్ డేట్లు మార్చే సంస్కృతి లేదంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 10కే విడుదల అని కరణ్ తేల్చేయబట్టి సినిమా ఆ తేదీకే విడుదలైంది.

ఫస్ట్ పార్ట్ కు వచ్చిన అద్భుతమైన స్పందన చూశాక కరణ్.. రెండో పార్టును మరింతగా నార్త్ జనాలకు చేరువ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం రెండో భాగానికి ఒకరిద్దరు బాలీవుడ్ నటుల్ని సినిమాలో ఇరికిద్దామని చూస్తున్నాడట. ఇదేమీ బ్యాడ్ ఐడియా ఏమీ కాదు. బాహుబలిలో ఒకరిద్దరు హిందీ జనాలుంటే మరింతగా నార్త్ ఆడియన్స్ కు కనెక్టయ్యేదనడంలో సందేహం లేదు. తమిళం వాళ్లకు బాహుబలి విపరీతంగా నచ్చడానికి సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించడం కూడా ఓ కారణం. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ కూడా వారికి పరిచయమే. అందుకే బాహుబలి రెండో పార్ట్ విషయంలో బాలీవుడ్ నటుల్ని నటింపజేయడం గురించి కరణ్ ప్రెషర్ చేస్తున్నాడట. ఐతే బాహుబలి-2కు సంబంధించి ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా 60 శాతం విషయయంలోనూ పక్కా ప్లానింగుతో ఉన్నారు. కొత్త క్యారెక్టర్ల ను ప్రవేశపెట్టడానికి లేదు. అలాగని ఎవరినైనా రీప్లేస్ చేయాలన్నా కష్టమే. ఏవైనా అతిథి పాత్రల్ని కలిపే ప్రయత్నం చేస్తే చేయొచ్చు. మరి జక్కన్న కాంప్రమైజ్ అవుతాడా అన్నది సందేహం.