బిపాషాని అమాంతం ఎత్తేశాడుగా!!

Fri May 19 2017 16:38:48 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత.. బిపాషా హ్యాపీనెస్ అమాంతం పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది ఈ బ్యూటీ. మరోవైపు కరణ్ సింగ్ గ్రోవర్ కూడా ఏం తక్కువ కాదు.

నా భార్య ఎంత అందంగా ఉందో చూడమంటూ.. బికినీ ఫోటోలను కూడా షేర్ చేసేస్తున్నాడు. కరణ్ కు మూడో పెళ్లి అయినా.. ఈ జంట మాత్రం తెగ సంతోషంగా దాదాపు ఏడాది గడిపేశారు. ఇప్పుడు ఓ సంథింగ్ స్పెషల్ పిక్ ను ఫ్యాన్స్ కు షేర్ చేసింది బిపాషా. ఇందులో తన భార్యను కరణ్ సింగ్ అమాంతం ఎత్తేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఎంతటి ఆప్యాయత ఉందో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. తనను అమాంతం నడుముల మీదకు ఎత్తుకున్న భర్తను.. ఆప్యాయంగా ముద్దాడుతోంది బిపాషా.

పెళ్లి తర్వాత బిపాషా బసు సినిమాలకు దూరమైపోయింది. నిజానికి పెళ్లికి ఏడాది ముందు నుంచే సినిమాల్లో కనిపించడం మానేసింది ఈ భామ. అయితే.. ప్రస్తుతం బిపాషా - కరణ్ సింగ్ గ్రోవర్ ల జంట తమ తొలి సంతానం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని.. త్వరలోనే ఈ న్యూస్ ప్రకటించే అవకాశం ఉందని ఓ రూమర్ బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/