Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో దిక్కులేదు.. టాలీవుడ్డా??

By:  Tupaki Desk   |   27 Feb 2017 10:27 AM GMT
బాలీవుడ్ లో దిక్కులేదు.. టాలీవుడ్డా??
X
ఆ మధ్యన బోంబే వెల్వెట్ సినిమాలో నెగెటివ్ షేడ్ పాత్రలో నటించాడు దర్శకుడు కరణ్‌ జోహార్. అయితే మనోడు దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేస్తాడో.. పక్కనే షో హోస్ట్ గా.. అలాగే రియాల్టీ షో జడ్జ్ గా.. అలాగే వ్యాఖ్యాతగా.. ఇలా చాలా రోల్స్ చేస్తుంటాడు. మధ్యలో ఎన్నో సినిమాలు తీస్తుంటాడు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు కరణ్‌ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

విషయం ఏంటంటే.. ట్విట్టర్లో ఒక చాట్ సెషన్ పెట్టిన కరణ్‌ జోహార్ ను.. ఒక తెలుగమ్మాయి భలే ప్రశ్న అడిగింది. అసలు మీరు నటుడిగా మా టాలీవుడ్ లో ఎందుకు అడుగుపెట్టట్లేదు? మేం ఇక్కడ అన్ని బాషల వారికి బాగా ఛాన్సులు ఇస్తున్నాం అని చెప్పింది. అయితే ఆ అమ్మాయి నిజానికి సెటైర్ వేసింది. తెలుగులో పరభాషా నటులకు ప్రాధ్యాన్యం ఎక్కువగా ఇస్తుంటాం అనే పంచ్ వేసింది. కాకపోతే కరణ్‌ జోహార్ మాత్రం చాలా డిఫరెంట్ గా స్పందించాడు. ''నాకు అసలు బాలీవుడ్ లోనే ఎవరూ కనీసం ఛాన్సులు కూడా ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఇక పక్క రాష్ట్రంలలో ఏం ప్రయత్నిస్తాను చెప్పండి?'' అన్నాడు.

అదీ కరక్టే కదా. ఏదైనా కూడా కరణ్‌ జోహార్ సెన్స్ ఆఫ్‌ హ్యూమర్ భలే డిఫరెంటుగా ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/