Begin typing your search above and press return to search.

నయనతార నటకు ఫిదా అయిన బాలీవుడ్ డైరక్టర్

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:37 PM GMT
నయనతార నటకు ఫిదా అయిన బాలీవుడ్ డైరక్టర్
X
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని నటి నయనతార తాజా సినిమా 'కొలమావు కోకిల' విడుదలైన తొలి మూడు రోజుల్లోనే 10 కోట్ల రూపాయలను రాబట్టేసింది. కేన్సర్ తో బాధపడుతోన్న తల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం డ్రగ్స్ మాఫియాలోకి దిగే పాత్రను పోషించిన నయన్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు ప్రమోషన్ కోసం గన్ ఇన్ కాదల్ అనే పేరుతో ఓ వీడియోను రూపొందించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

ఈ వీడియోపై కరణ్ జోహర్ ట్విట్టర్‌ లో స్పందించారు. గన్ ఇన్ కాదల్ వీడియోపై కరణ్ జోహర్ ట్విట్టర్‌ లో ప్రశంసల వర్షం కురిపించారు. నయనతార నటించిన కొలమారు కోకిల చిత్రం గురించి బ్లాక్‌ బస్టర్ టాక్ వినిపిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకొన్నది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలనే కోరిక వెంటాడుతున్నది అని కరణ్ ట్వీట్ చేశారు.

గన్ ఇన్ కాదల్ అనే వీడియోకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా - దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో నయన్‌ ను చూసిన కరణ్ జోహార్ రెస్పాండ్ కావడం ఇప్పుడు బాలీవుడ్‌ లో చర్చనీయాంశమైంది. నిర్మాత - దర్శకుడిగా - టీవీ హోస్టుగా బిజీగా ఉన్న ఆయన బాలీవుడ్‌లో నయన్‌తోనే ఈ సినిమా తీయొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.