విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయత్నాలు

Mon Dec 10 2018 13:26:41 GMT+0530 (IST)

పెళ్లి చూపులు సినిమాతో చిన్న సక్సెస్ తో మొదలై 60 కోట్ల షేర్ తెచ్చే బ్లాక్ బస్టర్ గీత గోవిందం దాకా సాగిన విజయ్ దేవరకొండ ప్రస్థానం మీద సినిమా పరిశ్రమలో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మినిమం గ్యారెంటీ హీరోగా ఇప్పుడు నిర్మాతల పాలిట కామధేనువుగా కనిపిస్తున్న హీరో ఇతనొక్కడే అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విజయ్ దాని తర్వాత కొత్తవి ఏవి ఒప్పుకోలేదు.తాజా అప్ డేట్ ప్రకారం విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కన్ను ఉన్నట్టు ముంబై టాక్. దానికి బలమైన కారణమే ఉంది. ఇటీవలే తన కాఫీ షోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తనకు ఇష్టమైన హీరో పేరుగా విజయ్ దేవరకొండనే చెప్పడం చూసి అతనూ షాక్ తిన్నాడు. అప్పుడు కాని అర్థం కాలేదు కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం అనుకున్న ఇతగాడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజయ్ దేవరకొండతో బాలీవుడ్ డెబ్యు చేయించడం కోసం కరణ్ జోహార్ సీరియస్ గానే ట్రై చేస్తున్నాడట. కాకపోతే ఇటీవలే తమిళ్ ఎంట్రీ కోసం నోటా చేసిన విజయ్ తొందరపాటులో ఎంత పొరపాటు చేసానో దాని ఫలితం చూసాక కాని అర్థం కాలేదు. పూర్తి అరవ నేటివిటీలో రూపొందిన ఆ మూవీ మనవాళ్ళను కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది.

అందుకే ఇతర బాషలలో సినిమా చేసే ముందు ఒకటికి రెండు సార్లు కథ విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అందుకే కరణ్ ప్రయత్నిస్తున్నా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదని సన్నిహితుల మాట. మొత్తానికి పది సినిమాలు దాటకుండానే హింది నిర్మాతల దృష్టిలో పడుతున్నాడంటే విజయ్ సుడి మాములుగా లేదుగా