Begin typing your search above and press return to search.

ఆమెపై స్టార్‌ డైరెక్టర్‌ సీరియస్‌

By:  Tupaki Desk   |   15 Feb 2019 12:26 PM GMT
ఆమెపై స్టార్‌ డైరెక్టర్‌ సీరియస్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ పెళ్లి కాకుండానే సరోగసి ద్వారా కవల పిల్లలకు తండ్రి అయిన విషయం తెల్సిందే. తన పిల్లలతో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు కరణ్‌ జోహార్‌. తన పిల్లలకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుతూ వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. పిల్లల పట్ల కరణ్‌ జోహార్‌ ఎంత ప్రేమగా, ఆప్యాయంగా ఉంటాడో బాలీవుడ్‌ లో ఎవరిని అడిగిన చెబుతారు. అలాంటిది సోషల్‌ మీడియాలో ఒక మహిళ కరణ్‌ జోహార్‌ తీరుపై ఆగ్రహం చేస్తూ విమర్శలు చేసింది.

ఆ మహిళ ట్విట్టర్‌ లో.. కరణ్‌ మీరు మీ పిల్లలకు తల్లి ప్రేమ లేకుండా చేశారు. వారిని తల్లి ప్రేమకు దూరం చేశారు అంటూ కామెంట్‌ చేసింది. ఆమె కామెంట్‌ కు కరణ్‌ జోహార్‌ సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యాడు. ఇలాంటి అనవసర కామెంట్స్‌ తో మీ సమయాన్ని వృదా చేసుకోకుండా, ఏదైనా పని చేసుకోండి. మీరు ఆలోచించాలి అంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

నా పిల్లలకు తల్లి ప్రేమ దూరం అయ్యిందని మీరు ఎలా అంటారు. నా పిల్లలకు తల్లి మా అమ్మనే. మా అమ్మ వారిని తల్లి ప్రేమను ఇస్తుంది. పిల్లలకు దక్కాల్సిన అన్ని ప్రేమలు దక్కుతున్నాయి, మీరు నా పిల్లల గురించి బాధ పడాల్సిన పని లేదు అంటూ కరణ్‌ జోహార్‌ ఆమెకు ట్విట్టర్‌ ద్వారా రిప్లై ఇచ్చాడు. కరణ్‌ సమర్ధిస్తూ చాలా మంది ట్వీట్స్‌ చేశారు.