ఐశ్వర్యను చంపేస్తానన్న డైరెక్టర్

Mon Mar 20 2017 21:36:41 GMT+0530 (IST)

సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ముందుంటాడు. రకరకాల కామెంట్స్ తో ఆకట్టుకునే ఈయన.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. షారూక్ ఖాన్ ను  పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ షాక్ తినేశారు.

రీసెంట్ గా జరిగిన ఇండియా కాంక్లేవ్ సదస్సులో... పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎవరిని చేసుకుంటారనే ప్రశ్నకు.. టక్కుమని షారూక్ పేరు చెప్పి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. అయితే షారూక్ ఖాన్ బంగ్లా సూపర్ గా ఉంటుందట. దాని కోసమే పెళ్లాడుతానని చెప్పాడు. అసలే ఈయనపై గే అనే ఆరోపణలు బోలెడన్ని ఉన్నాయి. అలాంటిది షారూక్ ను పెళ్లాడతానని చెప్పడంతో.. ఇవి మరింతగా పెరిగిపోవడం ఖాయం. మరోవైపు.. ఐశ్వర్యారాయ్ ను.. సిద్ధార్ధ మల్హోత్రాను చంపేస్తానని చెప్పి మళ్లీ షాక్ ఇచ్చేశాడు కరణ్ జోహార్. ఇంతకీ ఐశ్వర్యను చంపేస్తానని అనడానికి కారణం.. అభిషేక్ బచ్చన్ కోసం అంటున్నాడు.

చిన్నప్పటి అభిషేక్ తో కలిసి తిరిగేవాడట. కానీ ఐష్ ను అభిషేక్ పెళ్లాడాక అసలు తిరగడం కుదరట్లేదట. అందుకే ఐష్ ను చంపేస్తానని చెప్పాడు కరణ్. మరోవైపు సిద్ధార్ధ మల్హోత్రాను చంపేస్తానని అనేందుకు కారణం కూడా చెప్పాడు. ఆలియాను కూతురుగా భావిస్తాడు కాబట్టి.. ఆలియా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ ను మర్డర్ చేసేస్తాడట. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/