Begin typing your search above and press return to search.

కంగనాను ఆడుకున్న వారసులు

By:  Tupaki Desk   |   18 July 2017 12:30 AM GMT
కంగనాను ఆడుకున్న వారసులు
X
బాలీవుడ్ లో నెపోటిజంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. వారసత్వానికి ఫ్లాగ్ బేరర్ అంటూ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ను.. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో కంగనా రనౌత్ ఆరోపణలు గుప్పించింది. ఆ తర్వాత ఈ విషయంపై గట్టి డిబేట్స్ జరిగాయి. కొన్ని వారాలుగా ఈ విషయం సమసిపోతోందని అనుకున్న సమయంలో.. ఇప్పుడు స్వయంగా కరణ్ ఈ టాపిక్ ను మళ్లీ తట్టి లేపాడు.

ఐఫా అవార్డ్ వేడుకల్లో భాగంగా.. ఓ చిన్నపాటి డిబేట్ నే నిర్వహించారు. కరణ్ జోహార్.. సైఫ్ ఆలీ ఖాన్ లు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయగా.. డిషూం చిత్రానికి గాను బెస్ట్ పెర్ఫామెన్స్ ఇన్ కామిక్ రోల్ అవార్డును అందుకునేందుకు స్టేజ్ పైకి వచ్చాడు వరుణ్ ధావన్. డైరెక్టర్ డేవిడ్ ధావన్ కొడుకు అయిన వరుణ్ తో.. 'మీ తండ్రి కారణంగానే నువ్వు ఇక్కడున్నావ్' అనేశాడు సైఫ్ అలీ ఖాన్. ఆ వెంటనే వరుణ్ ధావన్ ఏ మాత్రం తగ్గకుండా.. షర్మిలా టాగూర్ ని గుర్తు చేస్తూ 'మీ అమ్మ కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావ్' అన్నాడు. ఈ రెండు మాటలను కంటిన్యూ చేస్తూ.. తన తండ్రి యష్ జోహార్ ను గుర్తు చేస్తూ 'నా తండ్రి కారణంగానే నేను ఇక్కడకు రాగలిగాను' అన్నాడు కరణ్ జోహార్.

ఆ వెంటనే ముగ్గురూ కలిసి 'నెపోజిటం రాక్స్' అంటూ స్లోగన్స్ ఇచ్చేయడం విశేషం. ఈ టాపిక్ ని మరింతగా కొనసాగించిన వరుణ్ ధావన్.. 'మీ సినిమాలో బోలె చూడియా.. బోలె కంగనా అనే పాట ఉంటుంది కదా' అనగానే.. 'కంగనా మాట్లాడకుండా ఉండడమే నయం.. ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడుతుంది కదా' అంటూ ఈ నెపోటిజం టాపిక్ ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఓపెన్ గానే చెప్పేశాడు కరణ్ జోహార్.