Begin typing your search above and press return to search.

స్వ‌లింగ సంప‌ర్కంపై స్టార్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   21 Sep 2019 7:54 AM GMT
స్వ‌లింగ సంప‌ర్కంపై స్టార్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌
X
ప్రేమ‌.. పెళ్లి.. గే క‌ల్చ‌ర్ .. వీట‌న్నిటి గురించి ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్ర‌స్తుతం ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్నాయి. రొటీనిటీకి భిన్నంగా అత‌డు ఇచ్చిన‌ ఆన్స‌ర్స్ షాకిస్తున్నాయి. అస‌లింత‌కీ ఎవ‌రాయ‌న‌.. ఎందుకంత వైరాగ్యం? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి..

బాలీవుడ్ లో పూల‌రంగ‌డు త‌ర‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఎవ‌రైనా వున్నారా అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు క‌ర‌ణ్ జోహార్‌. ఇటీవ‌ల ఇండియా టుడే- ముంబై కాన్ క్వేవ్ లో పాల్గొన్న ఆయ‌న‌ బాలీవుడ్ లో త‌న అన‌భ‌వాల‌ గురించి ర‌క‌ర‌కాల‌ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. వెండితెర‌పై అజ‌రామ‌ర‌మైన ప్రేమ‌క‌థ‌ల్ని ఆవిష్క‌రించి ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్టుగా పేరు తెచ్చుకున్న క‌ర‌ణ్ నిజ జీవితంలో విఫ‌ల ప్రేమికుడు. అయితే అత‌న్ని బాలీవుడ్ లో ఎవ‌రితో అయినా డేట్ కి వెళ్లొచ్చు క‌దా అని అడిగితే మాత్రం అదిరి పడుతున్నాడు. బీ టౌన్ లో ఏ స్టా ర్‌తోనూ డేటింగ్ చేసేంత ధైర్యం త‌న‌కు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

47 ఏళ్ల క‌ర‌ణ్ రిలేష‌న్ షిప్ ల‌కు దూరంగా వుంటూ సరోగ‌సీ ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రిగా మారిన విష‌యం తెలిసిందే. ప్రేమ‌లో విఫ‌ల‌మ‌య్యాన‌ని.. రిలేష‌న్ షిప్ ని మెయింటైన్ చేయ‌డంలోనూ ఫెయిల్ అయ్యానని. అందుకే డేటింగ్ ల‌కు దూరంగా వున్నాన‌ని చాలా సంద్భాల్లో క‌ర‌ణ్ వెల్ల‌డించాడు. సరోగ‌సీ ద్వారా యాష్‌- కోహీ అనే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రిగా మారిన క‌ర‌ణ్ మ‌రో ఆస‌క్తిక‌ర‌ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం విస్మ‌యానికి గురిచేసింది. రానున్న రోజుల్లో గే పెళ్లిళ్లు చాలా పెరిగిపోతాయ‌ని.. ఆ రోజులు ఎంతో దూరంలో లేవ‌ని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్రేమ‌.. పెళ్లికి దూరంగా వుండాల‌నుకున్నాను కాబ‌ట్టే త్వ‌ర‌గా మేలుకుని సరోగ‌సీ ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రిగా మారాన‌ని చెప్ప‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. స్వ‌లింగ సంప‌ర్కాన్ని వ్య‌తిరేకించే వాళ్లంతా రానున్న రోజుల్లో త‌మ అభిప్రాయాన్ని మార్చుకుంటార‌ని క‌ర‌ణ్ ఓపెన్ గా చెప్పడం బాలీవుడ్ లో పాశ్చాత్య‌ సంస్కృతికి అద్దం ప‌డుతోంది.