Begin typing your search above and press return to search.

కపూర్ అండ్ సన్స్ బలే ఉందే

By:  Tupaki Desk   |   11 Feb 2016 4:22 AM GMT
కపూర్ అండ్ సన్స్ బలే ఉందే
X
కుప్పలు తెప్పలుగా కేరక్టర్లు పెట్టి.. రిలేషన్స్ - ఎమోషన్స్ పండించడమంటే బాలీవుడ్ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు అలాంటి సినిమానే బాలీవుడ్ లో ఒకటి వస్తోంది. మార్చ్ 18న రిలీజ్ కానున్న కపూర్ అండ్ సన్స్ కు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్.

ఐదేళ్ల తర్వాత కలిసి ఇంటికొచ్చిన ఇద్దరు యంగ్ జనరేషన్ బ్రదర్స్. కుటుంబంతో కలిసి ఎంజాయ్ మెంట్ - గెట్ టుగెదర్ లతో ట్రైలర్ స్టార్ట్ చేసి.. వాళ్ల లవ్ స్టోరీలను బ్యూటిఫుల్ గా చూపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు, తిట్టుకోవడం కొట్టుకోవడం.. కుటుంబంతో గొడవపడ్డం, అన్నిటినీ మౌనంగా చూసే ఓ చూసే ఓ ముసలి కేరక్టర్ లో విభిన్నమైన గెటప్ తో రిషి కపూర్. మొత్తం ట్రైలర్ అంతా కనిపించినా రిషి కపూర్ ఆఖరులో మాట్లాడే మాటలే.. ట్రైలర్ కి హైలైట్ అని చెప్పాలి. లవ్ స్టోరీలను కూడా ఫన్నీగా తెరకెక్కించారు. మొత్తం మీద ఫ్యామిలీ ఎమోషన్స్ లో ఓ డిఫరెంట్ జోనర్ ని కపూర్ అండ్ సన్స్ మిగల్చనుందనే విషయం అర్ధమవుతోంది.

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన కపూర్ అండ్ సన్స్ కు షాకున్ బత్రా డైరెక్టర్. యాక్టర్స్ విషయానికొస్తే.. రిషికపూర్ తోపాటు సిద్ధార్ధ్ మల్హోత్రా - ఫవాద్ ఖాన్ - ఆలియా భట్ - రజత్ కపూర్ - రత్నా పాఠక్ లు మెయిన్ కేరక్టర్స్ కాగా.. ఇంకో బోలెడంత మంది తారాగణం ఉంది. మోస్ట్ ఫన్నీ అండ్ హిలేరియస్ ప్లస్ ఎమోషనల్ జర్నీకి సిద్ధం కావాలంటూ.. మేకర్స్ చేస్తున్న ప్రచారం కూడా ఆకట్టుకుంటోంది.