సరోవరం నుంచి స్కిప్ కొట్టిన హంసలు

Mon Jan 21 2019 21:15:41 GMT+0530 (IST)

కపూర్ సిస్టర్స్ జాన్వీ ఖుషీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అక్క కోసం చెల్లి.. చెల్లి కోసం అక్క! అన్నట్టే ఉంటారు ఆ ఇద్దరూ. అందుకే అన్యోన్యమైన ఈ సిస్టర్స్ కి ప్రఖ్యాత బిఎఫ్ఎఫ్ విత్ వోగ్ టీవీ షోలో కనిపించే అవకాశం దక్కింది. జూలీ నేహా ధూపియా హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో కపూర్ సిస్టర్స్ సందడి చేశారు. కపూర్ గాళ్స్ కి ఇదే తొలి డెబ్యూ టీవీ షో.ఈ షోలో జాన్వీ ఖుషీ వైట్ & వైట్ డ్రెస్ కోడ్ లో మైమరిపించారు. మానస సరోవరం నుంచి హంసలు దారి తప్పాయా? అన్నంతగా హోయలు పోయారు ఈ భామలు. జాన్వీ వైట్ & బ్లూ డిజైనర్  లుక్ లో దర్శనమిస్తే ఖుషీ మాత్రం వైట్ & కాఫీ కలర్ డ్రెస్ లో కనిపించింది. సిస్టర్స్ పైనే యూత్ కళ్లన్నీ. ఇదివరకూ ప్రఖ్యాత బిఎఫ్ఎఫ్ విత్ వోగ్ టీవీ షోలో పలువురు టాప్ స్టార్లు పాల్గొన్నారు. దీపిక పదుకొనే- అనీషా పదుకొనే కత్రిన కైఫ్ ఆలియా భట్ షాహిద్ - మీరా రాజ్ పుత్ వంటి సెలబ్రిటీలు టాక్ షోలో పాల్గొన్నారు.

ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే.. ధడక్ తర్వాత పలు క్రేజీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రం తక్త్ లో జాన్వీ ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ లో కరీనా ఆలియా భూమి పెడ్నేకర్ రణవీర్ సింగ్ వంటి స్టార్లు నటిస్తున్నారు. తదుపరి రణవీర్ సరసన జాన్వీ నటించనుందని తెలుస్తోంది. ఇకపోతే ఖుషీ కపూర్ తొందర్లోనే కథానాయికగా ఆరంగేట్రం చేసే ఛాన్సుందని తెలుస్తోంది. శిల్పాశెట్టి దీపిక తరహాలో ఖుషీ టాల్ బ్యూటీగా ఫేజ్ 3 ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.