Begin typing your search above and press return to search.

క‌మేడియ‌న్ క‌పిల్ తోటి న‌టుడ్ని కొట్టేశాడు

By:  Tupaki Desk   |   19 March 2017 8:28 AM GMT
క‌మేడియ‌న్ క‌పిల్ తోటి న‌టుడ్ని కొట్టేశాడు
X
జోకుల్ని పేలుస్తూ.. అంద‌రిని న‌వ్వుల్లో పూయించే టాప్ క‌మేడియ‌న్ క‌పిల్ శ‌ర్మ తాజాగా త‌న తీరుతో అంద‌రిని షాక్ కు గురి చేశారు. ఫుల్ గా తాగేసి.. త‌న స‌హ‌న‌టుడిపై దాడి చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విమానంలో న‌లుగురి ఎదుట దారుణంగా తిట్టేస్తూ.. కొట్టేసిన వైనం చూసిన వారంతా అవాక్క‌య్యారు. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌.. సిడ్నీల్లో షోలు చేసిన క‌పిల్ శ‌ర్మ త‌న తిరుగు ప్ర‌యాణాన్ని ఎయిరిండియా విమానంలో చేశారు.

ఈ విమానంలో త‌న సీటులో కూర్చున్న త‌న స‌హ‌న‌టుడు సునిల్ గ్రోవ‌ర్ మీద చేయి చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. నువ్వు నా ప‌నోడివంటూ తిట్ల దండ‌కాన్ని అందుకున్న క‌పిల్‌ శ‌ర్మ.. అత‌డిపై దాడి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాగిన మైకంలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొడుతున్నా.. స‌ద‌రు న‌టుడు నోటి నుంచి మాట రాలేదని.. కామ్ గా ఉండిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

దారుణంగా తిట్టేస్తూ.. కొట్టేస్తున్నా.. సునిల్ గ్రోవ‌ర్ మాత్రం కామ్ గా ఉన్నాడే త‌ప్పించి.. స్పందించ‌లేద‌ని చెబుతున్నారు. మ‌ద్యం మ‌త్తులో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న క‌పిల్‌శ‌ర్మ‌ను.. టీంలోని ఇత‌ర స‌భ్యులు వ‌చ్చి స‌ముదాయించి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. క‌పిల్‌ శ‌ర్మ చేసిన ర‌చ్చ‌పై ఎయిరిండియా అత‌డిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇక్క‌డ సునిల్ గ్రోవ‌ర్‌.. క‌పిల్ శ‌ర్మ మ‌ధ్య‌నున్న పంచాయితీని కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. క‌పిల్ శ‌ర్మ షోలో ప‌ని చేసే సునిల్‌.. క‌పిల్ త‌న‌కు స‌రిగా పారితోషికం ఇవ్వ‌టం లేదని.. త‌న‌కు తాను సొంతంగా స్టార్ ప్ల‌స్ లో షో చేశారు. అయితే.. అదంత‌గా వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టంతో తిరిగి. క‌పిల్ షోలో చేరారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ మ‌షూర్ గులాటీగా పాత్ర‌ను సునిల్ చేస్తున్నారు. దాడి స‌మాచారం నిజ‌మేన‌న్న వాద‌న‌ను బ‌లం చేకూరుస్తూ.. ట్విట్ట‌ర్‌ లో ఈ ఇద్ద‌రు న‌టులు ఒక‌రినొక‌రు అన్ ఫాలో చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రో విశేషం ఏమిటంటే.. క‌పిల్ శ‌ర్మ త‌న ప్రియురాలి గురించి రివీల్ చేసిన రోజు వ్య‌వ‌ధిలోనే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/