కుర్ర హీరోకి సిస్టర్ సెంటిమెంట్ పెట్టారే

Thu Jun 21 2018 22:41:58 GMT+0530 (IST)


యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్లు జోష్ మీద ఉన్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఇతడి నుంచి వచ్చే సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యలో ఏం మంత్రం వేశావే అంటూ సినిమా వచ్చింది కానీ.. ఇది తన బ్యాక్ లాగ్ అనే ముందే చెప్పేశాడు ఈ హీరో. ఇప్పుడు ఒకవైపు ట్యాక్సీవాలాను రిలీజ్ కి రెడీ చేసేసిన ఈ కుర్ర స్టార్.. మరోవైపు గీత గోవిందం అంటూ ఇంకో సినిమాకు కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.విజయ్ దేవరకొండ.. రష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం మూవీకి ఫస్ట్ లుక్ జూన్ 23న విడుదల చేస్తామంటూ.. ఇచ్చిన ప్రీలుక్ పోస్టర్ బాగానే ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన భామ రష్మిక అయినా.. మరో కన్నడ బ్యూటీ కూడా గీత గోవిందంలో కనిపించనుంది. మౌర్యాని అనే చిన్నది కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈమెకు తెలుగు సినిమాలు ఏమీ కొత్త కాదు. గతంలో జానకి రాముడు.. ఇంట్లో దెయ్యం-నాకేం బయ్యం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అనుభవం ఉంది.

గీత గోవిందం సినిమాలో హీరోకి చెల్లెలి పాత్రలో మౌర్యాని కనిపించనుంది. ఇప్పటివరకూ హీరోయిన్ రోల్స్ లో కనిపించిన ఈ భామకు.. ఇలా సిస్టర్ గా కనిపించడం కొత్తే. అయితే.. ఈ సినిమాలో అమ్మడి క్యారెక్టర్ చుట్టూ కథ బాగానే నడుస్తుందట. అందుకే ఈ పాత్రకు వెంటనే యాక్సెప్ట్ చేసిందట. ఒకవైపు ఓ కన్నడ భామతో ప్రేమ కథ నడిపిస్తూనే.. మరో శాండల్ వుడ్ బ్యూటీతో ఎమోషన్స్ పండిస్తాడన్న మాట మన హీరో విజయ్ దేవరకొండ.