Begin typing your search above and press return to search.

మహేష్ కు కన్నడిగుల పంచ్

By:  Tupaki Desk   |   22 April 2018 8:35 AM GMT
మహేష్ కు కన్నడిగుల పంచ్
X
చాన్నాళ్ల తర్వాత మహేష బాబు చాలా సంతోషంగా ఉన్నాడు. అతడి కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ చాలా మంచి టాక్ తెచ్చుకుంది. అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. మహేష్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచే అవకాశాలున్నాయి. ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ సినిమాలతో షాక్ మీద షాక్ తిన్న మహేష్ కు ఈ చిత్రం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని తన భార్యతో పంచుకుంటూ ఒక స్పెషల్ పిక్ నిన్న రాత్రి ఇన్‌ స్టాగ్రాంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దాని కంటే ముందు ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు మహేష్. కేవలం తెలుగు వాళ్లకే కాక.. తమిళులు.. హిందీ.. మలయాళ ప్రేక్షకులకు కూడా మహేష్ కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్ల వాళ్ల భాషల్లోనే మహేష్ థ్యాంక్స్ చెప్పడం విశేషం.

ఐతే కన్నడిగులను మాత్రం మహేష్ మిస్సయిపోయాడు. అతడి ట్వీట్లో కన్నడ ‘థ్యాంక్స్’ మిస్సయింది. దీంతో అక్కడి జనాలకు కోపం వచ్చేసింది. తెలుగు సినిమాలు కర్ణాటకలో భారీ ఎత్తున రిలీజవుతాయి. కర్ణాటకలోని తెలుగు వాళ్లే కాదు.. కన్నడిగులు సైతం మన సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ నేపథ్యంలో కన్నడ నెటిజన్లు మహేష్ బాబు మీద విమర్శలు గుప్పించారు. మమ్మల్ని ఎందుకు మిస్ చేశావ్.. మాపై చిన్నచూపా అని ప్రశ్నించారు. దీంతో మహేష్ తన ట్వీట్ ను ఎడిట్ చేద్దామని చూశాడు కానీ.. ట్విట్టర్లో ఆ ఆఫ్షన్ లేకపోవడంతో కన్నడిగులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేకంగా మరో ట్వీట్ చేయడం విశేషం. అలా ఈ ఇష్యూను సెటిల్ చేశాడు ప్రిన్స్.