ప్రిన్స్ పై కన్నడ ఫ్యాన్స్ గుస్సా!

Fri Oct 19 2018 18:19:52 GMT+0530 (IST)

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ కు ఓ బ్రాండ్ ఉంది. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో ప్రిన్స్ పేరు ముందుంటుంది. తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ భాషల్లో కూడా మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్ లో అయితే ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ కు 70లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మహేష్ యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల గురించి - ఫ్యామిలీ గురించి అప్ డేట్ ఇస్తున్నారు. దీంతో మహేష్ అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన అభిమానులకు ప్రిన్స్ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే తెలుగు - తమిళం - మలయాలం - ఇంగ్లీష్ - హిందీ భాషల్లో శుభాకాంక్షలు తెలిపిన మహేష్ కన్నడ భాషలో తెలపడం మరిచాడు. దీంతో కన్నడ ఫ్యాన్స్ ..మహేష్ పై గుర్రుగా ఉన్నారు.తమ హీరో అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కన్నడ అభిమానులకు కూడా కాస్త గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. దీంతో కన్నడ భాషలో విష్ చేయడం మరచిపోయానని ప్రిన్స్ గ్రహించాడు. వెంటనే పొరపాటును సరిచేసుకొని కన్నడ భాషలో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో కన్నడ ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. మహేష్ ఇలా కన్నడ భాషను పొరపాటున మరచిపోవడం రెండోసారి. ‘భరత్ అనే నేను’చిత్రం సక్సెస్ అయినందుకు అభిమానులకు ట్వీట్ చేస్తూ కన్నడ భాషలో ట్వీట్ చేయడం మరిచాడు. దీంతో కన్నడ అభిమానులు ఆగ్రహించారు. ఆ తర్వాత కన్నడ ఫ్యాన్స్ కోసం మరో ట్వీట్ చేయడంతో వారు శాంతించారు.