Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో లైంగిక వేదింపులు.. కేసు నమోదు

By:  Tupaki Desk   |   12 Feb 2019 8:33 AM GMT
బిగ్‌ బాస్‌ లో లైంగిక వేదింపులు.. కేసు నమోదు
X
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆధరణ దక్కించుకుంటున్న బిగ్‌ బాస్‌ ఇండియాలో కూడా చాలా ఏళ్లుగా ఆధరణ దక్కించుకుంటూనే ఉంది. ఇక సౌత్‌ లో కూడా బిగ్‌ బాస్‌ సందడి మొదలైంది. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే రెండు సీజన్‌ ల బిగ్‌ బాస్‌ పూర్తి అయ్యింది. ఇక కన్నడంలో కూడా బిగ్‌ బాస్‌ షో సక్సెస్‌ ఫుల్‌ గా సాగుతుంది. ఇప్పటి వరకు బిగ్‌ బాస్‌ పై ఎన్నో వివాదాలు, విమర్శలు వచ్చాయి. ఇండియాలో మొదటి సారి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ లైంగిక వేదింపుల కేసును నమోదు చేయడం జరిగింది.

కన్నడ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌ కవితా గౌడ మహిళ కమీషన్‌ కు మరో బిగ్‌ బాస్‌ పార్టిసిమెంట్‌ అయిన యాండీపై ఫిర్యాదు ఇచ్చింది. సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌ టాస్క్‌ లో భాగంగా తనను యాండీ లైంగికంగా వేదించాడని, అతడి ప్రవర్తనతో నేను చాలా ఇబ్బంది పడ్డానంటూ కవితా గౌడ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రెండు రోజులు జరిగిన ఆ టాస్క్‌ లో యాండీ తనను పలు సార్లు లైంగికంగా వేదించాడని పేర్కొంది. ఈ విషయాన్ని బిగ్‌ బాస్‌ నిర్మాత గురుదాస్‌ శణైకి చెప్పినట్లుగా పేర్కొంది. బిగ్‌ బాస్‌ నుండి బయటకు వచ్చిన వెంటనే కవితా ఫిర్యాదు చేసింది.

మరో వైపు యాండీ ఈ విషయమై స్పందిస్తూ... బిగ్‌ బాస్‌ తర్వాత తాను కవితాను కలవలేదని, ఆమె పోటీలో ఓడిపోవడంతో తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ యాండీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఎలాంటి విచారణకు అయినా సిద్దమే అంటూ యాండీ చెప్పినట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్‌ బాస్‌ పై ఇలాంటి విమర్శ రావడంతో కన్నడ ప్రేక్షకులు బిగ్‌ బాస్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.