Begin typing your search above and press return to search.

ఫోక‌స్‌: రైజింగ్ క‌న్న‌డ బ్యూటీస్

By:  Tupaki Desk   |   24 April 2019 1:30 AM GMT
ఫోక‌స్‌: రైజింగ్ క‌న్న‌డ బ్యూటీస్
X
టాలీవుడ్ లో మ‌ల్లూభామ‌ల హ‌వా గురించి తెలిసిందే. ద‌శాబ్ధాలుగా మ‌ల‌యాళీ గాళ్స్ హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో పాగా వేసి ఇత‌ర భామ‌ల‌కు ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నారు. అయితే ప్ర‌స్తుత సీజ‌న్ మాత్రం మ‌ల్లూ భామ‌ల‌ది కాద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సీజ‌న్ లో క‌న్న‌డ భామ‌ల డామినేష‌న్‌ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఓ న‌లుగురైదుగురు బెంగ‌ళూరు బేస్డ్ భామ‌లు మాంచి స్పీడ్ మీద క‌నిపిస్తుంటే మ‌ల్లూ బ్యూటీస్ మాత్రం స‌రైన ఛాన్సుల్లేక ప‌లాయ‌నం చిత్త‌గించినట్టే క‌నిపిస్తోంది. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం హవా సాగిస్తున్న క‌న్న‌డ బ్యూటీస్ వివ‌రాలు ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌రం.

ఛ‌లో.. గీత గోవిందం సినిమాల‌తో అనూహ్యంగా తెర‌పైకి దూసుకొచ్చింది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న. రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో కెరీర్ ని స్కై లోకి లేపేసింది. `డియ‌ర్ కామ్రేడ్` రిలీజ్ కి రెడీ అవుతుండ‌డంతో మ‌రోసారి ఫ్యాన్స్ లో క్రేజీగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారింది స‌న్నివేశం. అల్లు అర్జున్.. అఖిల్ లాంటి స్టార్ల స‌ర‌స‌న ర‌ష్మిక‌ న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మునుముందు మెగా హీరోలు.. అక్కినేని హీరోల‌తో పాటు క్రేజీ హీరోల‌కు ఓ పెర్ఫెక్ట్ ఆప్ష‌న్ గానూ క‌నిపిస్తోంది. అలాగే మ‌రో బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ అక్కినేని హీరోలు నాగ‌చైత‌న్య‌ - అఖిల్ స‌ర‌స‌న న‌టించి ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ పూరి కాంపౌండ్ లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. రామ్ లాంటి ఎన‌ర్జిటిక్ స్టార్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఈ సినిమా హిట్ట‌యితే ఈ బ్యూటీకి మ‌రిన్ని ఛాన్సులుంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఛార్మింగ్ ప్రొడ్యూస‌ర్ ఛార్మితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది కాబ‌ట్టి తెలుగులో నిధి కెరీర్ కి డోఖా ఏం ఉండ‌దని అర్థ‌మ‌వుతోంది. మ‌రో క‌న్న‌డ బ్యూటీ న‌భా న‌టేష్ సైతం పూరి - రామ్ ఎన‌ర్జిటిక్ కాంబినేష‌న్ సినిమాలో న‌టిస్తూ అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పేసుకుంది. సుధీర్ బాబు స‌ర‌స‌న `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంతో తొలి ప్ర‌య‌త్న‌మే న‌భా హిట్టందుకుని కాన్ఫిడెంట్ గా దూసుకెళుతోంది.

ఈ బ్యూటీస్ కి ధీటుగానే దూసుకొచ్చింది శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్. ఆరంభ‌మే క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని టాలీవుడ్ లోనూ హిట్ సినిమాతో కెరీర్ ని కిక్ స్టార్ట్ చేసింది. నాని స‌ర‌స‌న న‌టించిన జెర్సీ చిత్రానికి యునానిమ‌స్ గా హిట్ టాక్ వ‌చ్చింది. దానికి మించి సింపుల్ ఎక్స్ ప్రెష‌న్స్ తో యువ‌త‌రం గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ బ్యూటీ కెరీర్ కి ఇక్క‌డ డోఖా లేద‌నే అర్థ‌మ‌వుతోంది. అప్పుడే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ ఈ అమ్మ‌డిని త‌దుప‌రి చిత్రానికి లాక్ చేశారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ స్పీడ్ లో నాలుగైదేళ్లు సునాయాసంగా బండి న‌డిపించేస్తుంది శ్ర‌ద్ధా. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన క‌న్న‌డ హాటీ సంజ‌న సోద‌రి నిక్కీ గ‌ర్లానీ చాలా కాలంగా త‌మిళంలో హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఓవైపు టాలీవుడ్ లో క‌న్న‌డ భామ‌ల రైజింగ్ క‌నిపిస్తుంటే.. మ‌రోవైపు మ‌ల‌యాళీ బ్యూటీ కీర్తి సురేష్ బాలీవుడ్ వైపు అడుగులు వేసి షాకిచ్చింది. అక్క‌డ అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న భారీ చిత్రంలో న‌టిస్తూ లాక్ అయిపోయింది. మ‌హాన‌టి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత టాలీవుడ్ లో ఆశించినంత‌ క్రేజీ ఆఫ‌ర్ కీర్తికి ద‌క్క‌క‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రో క్యూట్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సైతం వ‌రుస ఫ్లాప్ ల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. ప్ర‌స్తుతం మ‌ల్లూవుడ్ లోనే ఈ అమ్మ‌డు కెరీర్ పై దృష్టి సారిస్తోంది. జై ల‌వ‌కుశ‌ - 118 చిత్రాల‌తో నంద‌మూరి నాయిక‌గా పాపుల‌రైన‌ నివేద థామ‌స్ ప్ర‌స్తుతం చిన్న సినిమాలే చేస్తోంది. త‌న‌కు భారీ చిత్రాలేవీ లేవు. సీనియ‌ర్ బ్యూటీ నిత్యామీన‌న్ సైతం ఇటీవ‌ల తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. త‌మిళంలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ మిన‌హా నిత్యా వేరొక భారీ చిత్రంలో న‌టిస్తున్న‌ది లేదు. ప‌లువురు మ‌ల్లూ భామ‌ల కెరీర్ డైల‌మాలోనే కొన‌సాగుతోంది. ఇక క‌న్న‌డ భామ‌ల‌తో పాటు ముంబై .. చెన్న‌య్ .. పంజాబ్ కి చెందిన ప‌లువురు అంద‌గ‌త్తెల దూకుడు టాలీవుడ్ లో క‌నిపిస్తోంది.