Begin typing your search above and press return to search.

యాంకర్ ని కొట్టినంత పని చేసేసిన హీరోయిన్

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:58 AM GMT
యాంకర్ ని కొట్టినంత పని చేసేసిన హీరోయిన్
X
కంగనా రనౌత్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్. ఎలాంటి సందర్భంపై అయినా ఈమె రియాక్షన్ చాలా షార్ప్ గాను.. ఒక్కోసారి తీవ్రంగాను ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ తన లేటెస్ట్ మూవీ రంగూన్ ను ప్రమోట్ చేసుకోవడంలో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా 'ది వాయిస్ ఇండియా సీజన్-2' కార్యక్రమానికి వెళ్లింది కంగనా. అక్కడ యాంకర్ సుగంధ మిశ్రాతో ఈమెకు ఓ వివాదం వచ్చేసింది. సుగంధ మిమిక్రీ చేయడంలో దిట్ట అనే విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ జడ్జ్ లు సలీం మర్చంట్, సింగర్ షాన్‌ లు.. కంగనా ఎదురుగా ఆమె వాయిస్ ను ఇమిటేట్ చేయమని చెప్పారు. దీంతో వెంటనే కంగనా వాయిస్ ను యాక్టింగ్ ని ఇమిటేట్ చేసింది సుగంధ. కానీ.. ఈ ఇమిటేషన్ కంగనాకు ఏ మాత్రం నచ్చలేదు.

'నేను తనను చాచి పెట్టి చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నా' అనేసింది కంగనా రనౌత్. దీంతో మొత్తం అందరూ స్టన్ అయిపోయారు. కానీ యాంకర్ సుగంధ మాత్రం చాలా ఇంటెలిజెంట్ గా టాపిక్ ను డైవర్ట్ చేసి.. ప్రోగ్రామ్ ను రన్ చేసేసింది. అయితే.. కంగనా రియాక్షన్ మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/