Begin typing your search above and press return to search.

న్యూడ్ సీన్లలో నిజంగా నేనే అంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Feb 2017 11:14 AM GMT
న్యూడ్ సీన్లలో నిజంగా నేనే అంటున్న హీరోయిన్
X
బాలీవుడ్ చిత్రం రంగూన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఒక డౌట్ వ్యక్తంచేస్తున్నారు. అసలు కంగనా రనౌత్ ఈ రేంజ్ లో రెచ్చిపోయిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా కంగన ఒంటికి బురద పూసుకుని షాహిద్ కపూర్ పై పడుకుని పెదాలను కసిగా కొరికేస్తున్న సీన్లలో నిజంగా ఆమే ఉందా అని అనుమానపడుతున్నారు. అసలు ఈ సన్నివేశాల్లో నిజంగానే కంగాన న్యూడ్ గా నటించిందా.. లేదా అనే సందేహం అందరిలో కలుగుతోంది. ప్రధానంగా కంగనా ముఖం సరిగ్గా చూపించకుండా ఆమెను పూర్తి న్యూడ్ గా చూపిస్తుండడంతో డూప్ కావచ్చనుకుంటున్నారు.

కంగన మాత్రం ఇది ఒరిజినల్ అని.. ఇందులో డూప్ లు ఎవరూ లేరని, తానే నటించానని బోల్డ్ గా ఒప్పేసుకుంటోంది. సినిమాకు సంబంధించిన మిగతా ాయూనిట్ కూడా అదే మాట చెబుతోంది. కంగన షూటింగ్‌ సమయంలో పూర్తిగా టాప్‌లెస్‌గానే నటించిందట. ‘నగ్న సన్నివేశాల కోసం ఎలాంటి ట్రిక్కులూ ఉపయోగించలేదు. ఆ సన్నివేశాల్లో నటించింది నేనే. అది కూడా నటనలో ఓ భాగమేన’ని కంగన రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కంగన కొద్దికాలంలో తన మనసులో భావాలను నిర్మొహమాటంగా చెబుతూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సెక్సుకు సంబంధించి చాలా ఓపెన్ గా మాట్లాడేస్తోంది. బాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలకు పడక సుఖం ఇస్తేనే మంచి ఛాన్సులు వస్తాయని గతంలో ఆమె చెప్పింది. తాజాగా.. న్యూడ్ సీన్లలో నిర్మొహమాటంగా నటించేసి.. అది నేనేనంటూ ఓపెన్ గా ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. అన్నట్లు.. ఈ సినిమా ఈ నెల 24న వస్తోంది.. కంగన అందాలను ఆస్వాదించడానికి రెడీ అయిపోండి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/