Begin typing your search above and press return to search.

మన మారుతి ఎప్పుడో తీసేసినదే...

By:  Tupaki Desk   |   28 Aug 2015 6:03 PM GMT


బాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న సినిమాల్లో ఇటీవలి కాలంలో క్రియేటివిటీ పాళ్లు ఎక్కువే కనిపిస్తోంది. కథ, స్క్రీన్‌ ప్లే నుంచి సాంగ్‌ మేకింగ్‌ వరకూ ప్రతి విషయంలో సంథింగ్‌ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించేందుకు ఉబలాటపడుతున్నారు. ఆ తరహాలోనే ఇమ్రాన్‌ ఖాన్‌, కంగన రనౌత్‌ జంట నటించిన ఓ సినిమాలోని సాంగ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. లిప్‌ టు లిప్‌ అంటూ సాగే ఈ పాటను రితు పాథక్‌, నిఖిల్‌ డి సౌజా పాడారు. శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ సంగీతం అందించారు. యానిమేటెడ్‌ బొమ్మల కదలికలతోనే మ్యాజిక్‌ చేసి చూపించాడు.

ఈ సాంగ్‌ విజువల్స్‌ కంప్లీట్‌ గా డిఫరెంట్‌. మేకింగ్‌లో బోలెడంత సర్‌ ప్రైజ్‌ ఉంది. మోషన్‌ కంట్రోల్‌ పిక్చరైజేషన్‌ పద్ధతిలో ఈ పాటను చిత్రీకరించారు. బ్లూమ్యాట్‌, గ్రీన్‌ మ్యాట్‌ వంటి సాంకేతిక విషయాల్ని జోడించి విజువలైజేషన్‌ లో సంథింగ్‌ చూపించారు. యానిమేషన్‌ బొమ్మల తరహాలో నాయకానాయికల కదలికలు ఈ పాటలో హైలైట్‌.

అయితే ఇలాంటి మేకింగ్‌ ఇదే మొదటిసారి కాదు. మన టాలీవుడ్‌ లోనూ మారుతి ఇదివరకే ఈ టైపులో ఓ పాటని తెరపై చూపించేశాడు. కొత్త జంట సినిమాలో శిరీష్‌-రెజీన జంటను ఇలాంటి ఓ యానిమేషన్‌ సాంగ్‌ లో చూపించి మెస్మరైజ్‌ చేశాడు మారుతి. మనవాడు తీశాడు కాబట్టి దానికి జాతీయ స్థాయి గుర్తింపు రాలేదు కానీ, ట్యాలెంటులో మన మారుతి ఎక్కడా తీసిపోడు. అదన్నమాట!!