అక్కడ టచ్ చేసి వెకిలిగా నవ్వాడు

Wed Jan 23 2019 07:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' చిత్రం రిపబ్లిక్ డే సందర్బంగా విడుదలకు సిద్దం అవుతోంది. జాన్సి రాణి లక్ష్మిబాయి కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాలతో పాటు దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ఈ సందర్బంగా మీటూ ఉద్యమం గురించి కూడా కంగనా మాట్లాడింది.ఇండస్ట్రీలో ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులను ఈమద్య కాలంలో బయట పెడుతూ వస్తున్న కారణంగా ఇప్పుడు ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు చాలా వరకు తగ్గాయి. లైంగిక వేదింపులకు పాల్పడేందుకు భయపడుతున్నారు. ఈ భయం ఇలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోనే కాకుండా బయట వారు కూడా లైంగిక వేదింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అమ్మాయిలు మర్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటూ సూచించింది.

తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి కంగనా మాట్లాడుతూ.. తన కెరీర్ ఆరంభంలో ఒక వ్యక్తి తన పిరుదులపై గట్టిగా నొక్కాడు - ఇబ్బందిగా నేను చూస్తూ ఉండగా - అతడు వెకిలిగా నవ్వడంతో పాటు - ఏం చేస్తావన్నట్లుగా చూశాడు. ఆ సమయంలో నేను అశక్తురాలిగా ఉండిపోయాను. అటువంటి దారుణమైన సంఘటనలు ఎన్నో ఎదురవుతున్నా కూడా కొందరు మౌనంగా వాటిని భరిస్తూ వస్తున్నారంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఇక తన 'మణికర్ణిక' చిత్రం విడుదల విడుదల విషయంపై వస్తున్న పుకార్లను కొట్టి పారేసింది. అనుకున్నట్లుగా చిత్రంను జనవరి 25న విడుదల చేయబోతున్నట్లుగా ఆమె ప్రకటించింది.