మణికర్ణిక కత్తిసాము మామూలుగా లేదు

Thu Oct 12 2017 23:32:56 GMT+0530 (IST)

చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ సినిమాలను ఎక్కడ తీసినా సరిపోతుంది. కానీ అలనాటి చరిత్రకారుల బయోపిక్ తీయాలంటే సినిమా స్టార్ట్ కాకముందు నుండే కష్టపడలి. ప్రతి ఫ్రేములో ప్రేక్షకుడి ఊహలను మరో స్థాయికి పెంచేలా ఉండాలి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి భాయి చరిత్రను కూడా తెరపై 'మాణికర్ణి' గా రాదా కృష్ణ జాగర్లమూడి (క్రిష్)  అలానే చూపించబోతున్నాడు.సినిమాలో ఝాన్సీ రాణిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం కావడంతో అమ్మడు ఏ మాత్రం విశ్రాంతి లేకుండా కష్టపడుతోంది. వీరనారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు అమ్మడు రీసెంట్ గా కత్తి సామును చేసింది. యాక్షన్ సీన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియోను ఇప్పుడు బయటకు రావడంతో.. కంగనా సినిమా కోసం ఎంతగా కష్టపడుతుందో తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు హాలీవుడ్ కి చెందిన నిక్ పావెల్ స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. శంకర్ - ఏహాసన్ - లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.   

అన్నీ బాగానే ఉన్నాయి కాని.. కంగన మాత్రం మాట్లాడితే హృతిక్ రోషన్ తో జరిగిన ఉదాంతం గురించి తెగ కామెంట్స్ చేయడం మాత్రం బాలేదని అంటున్నారు నెటిజన్లు. ఏమ్మా కంగనా.. వింటున్నావా?