Begin typing your search above and press return to search.

కంగన ఆఖరి ఆయుధం వాడేస్తోందా?

By:  Tupaki Desk   |   5 May 2016 4:55 AM GMT
కంగన ఆఖరి ఆయుధం వాడేస్తోందా?
X
హృతిక్ రోషన్ పై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల వ్యవహారం చాలానే దుమారం రేపింది. ఈ వివాదం గురించి ఇకపై పబ్లిక్ గా కామెంట్ చేయబోమంటూ రీసెంట్ గానే స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చిన కంగనా.. తన వాదన వినిపించేందుకు ఇప్పుడు కొత్త రూట్ ని ఎంచుకుంది. నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నాక కంగనా ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే.. అసలు విషయం పక్కకు తోసేసి మహిళల హక్కులు - ఫెమినిజం అంటూ కొత్త కబుర్లు వినిపిస్తోంది.

కంగనా వ్యవహారంలో చాలానే తప్పులున్నాయి. తన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. పైగా హృతిక్ ని దారుణంగా అవమానించేందుకు ట్రై చేసింది. హృతిక్ తో రిలేషన్ అంతా ఆమె ఊహల్లోనే అని, అతని వైపు రెస్పాన్స్ లేదనే నిర్ణయానికి పోలీసులు కూడా వచ్చారు. పైగా ఈమె మాజీ లవర్ అయితే.. కంగనానే కౌంటర్ చేసేశాడు. చేతబడులు చేయించిందని, మెన్ స్ట్రువల్ బ్లడ్ ను ఆహారంలో కలిపి తినిపించిందని.. ఇలా చాలానే మాటలన్నాడు. వీటి గురించి మాట్లాడకుండా.. తను బైట వ్యక్తిని కాబట్టి తొక్కేస్తున్నారంటూ అర్ధం పర్ధం లేని కబుర్లతో.. సానుభూతి కోసం ట్రై చేస్తోంది కంగనా.

తను చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోగా.. తనకే అవి తిరిగి తగిలేసరిగి.. అమ్మాయిని కాబట్టి తొక్కేస్తున్నారని కంగనా రనౌత్ అనడంలో అర్ధం లేదు. అలాగే ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగి, ఇన్నేసి సినిమాలు చేసి.. మూడు నేషనల్‌ అవార్డులు అందుకున్న కంగనా.. తను బయట నుండి వచ్చిన వ్యక్తిని కాబట్టి బాలీవుడ్‌ లో తొక్కేశారు అనడం అర్ధంలేని కామెంట్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. సిపంథీ కోసం కెమేరా ముందు కన్నీళ్లు పెట్టేసుకున్నా, ఫెమినిజం అంటూ ఆయుధాన్ని బయటకు తీసినా.. కంగనాకు మాత్రం మద్దతు లభించడం లేదు.