ఈ ఎక్స్ పోజింగ్ టూమచ్చే

Fri Oct 13 2017 11:39:31 GMT+0530 (IST)

మామి(ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) ఫిలిం ఫెస్టివల్ 2017 త్వరలో ప్రారంభం కాబోతోంది. రీసెంట్ గా ఈ కార్యక్రమానికి సంబంధించి రెడ్ కార్పెట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో చాలామంది ఫిలిం సెలబ్రిటీలు పాల్గొన్నారు. అందరితో పాటు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేసింది.సహజంగా కంగనా అంటేనే పెర్ఫామెన్స్ ప్లస్ గ్లామర్. తన దగ్గర యాక్టింగ్ ట్యాలెంట్ ఉంది కదా అని.. ఎక్స్ పోజింగ్ కి నో చెప్పే టైపు కాదు ఈ బాలీవుడ్ క్వీన్. కానీ ఫ్యాషన్ స్టైల్ ఈ మధ్య మరీ శృతి మించిపోతోంది. ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే.. ఫెమినిజం మీద సుదీర్ఘమైన లెక్చర్స్ ఇచ్చేసే ట్యాలెంట్ ఈ భామ దగ్గర చాలానే ఉంది. కానీ మామి ఈవెంట్ లో కంగనా వేసుకున్న డ్రెస్ మాత్రం చాలానే విమర్శలకు గురవుతోంది. మెరూన్ కలర్ టాప్ ను మరీ డీప్ కట్స్ తో డిజైన్ చేయించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

సినిమాల్లో సహజంగా ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయ్ కానీ.. ఇంతలేసి ఎక్స్ పోజింగ్ పబ్లిక్ ఈవెంట్ లో అంటే మాత్రం టూమచ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలను పట్టించుకునే ఓపిక ప్లస్ తీరిక ప్లస్ ఉద్దేశ్యాల్లాంటివి కంగనాకు ఉండవు కానీ.. మరీ ఇలాంటి డ్రెసింగ్ వేసుకుని హెడ్ లైన్స్ లో నిలవాల్సిన అవసరం అయితే కంగనాకు లేదు కదా.