Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డులకు అదేం డ్రెస్‌ పాపాయ్‌?

By:  Tupaki Desk   |   5 May 2016 12:06 PM GMT
నేషనల్ అవార్డులకు అదేం డ్రెస్‌ పాపాయ్‌?
X
రీసెంట్ గా ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్రస్ చేసిన వ్యక్తి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అయితే.. పురస్కారాలను అందించిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. మరి ఈ కార్యక్రమానికి వచ్చే వ్యక్తుల ప్రవర్తన - డ్రెసింగ్ ఎలా ఉండాలి? భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అంటే.. భారతీయ గౌరవాన్ని కాపాడేలా సాంప్రదాయ వస్త్రధారణ ఆశించడం సహజం.

దాదాపు అందరూ ఇదే రీతిలో డ్రెసింగ్ చేసుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోసేసింది. సగం సోయగాలను బయటకు చూపించేస్తూ.. క్లీవేజ్ షో చేసేసింది. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికి గాను కంగనా రనౌత్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేస్తూ హాజరైంది కంగనా. అలాగని ఈమెకు పద్ధతులేవీ తెలీదని అనుకోవడానికి లేదు. ఈ అవార్డు అందుకోవడం కంగనా రనౌత్ కు ఇదేమీ మొదటి సారి కాదు. ఏకంగా మూడో సారి ఈ అవార్డును చేజిక్కించుకుంది కంగనా.

అయినా సరే.. ఇలా డ్రసింగ్ విషయంలో అసభ్యంగా ఉందనే మాట పడాల్సి వచ్చింది. రాజకీయ పెద్దలు పాల్గొనే ఈ కార్యక్రమంలో కాసింత పద్దతిగా చీరకట్టుకు వస్తే సరిపోయేది కదా! ఇంతమందితో నిలదీయించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదని.. కంగనకు సలహాలు ఇస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు.