Begin typing your search above and press return to search.

యుద్ధం.. శృంగారం.. వాట్ ఏ స్టేట్మెంట్

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:13 AM GMT
యుద్ధం.. శృంగారం.. వాట్ ఏ స్టేట్మెంట్
X
బాలీవుడ్ లో ఇప్పుడు రంగూన్ అనే మూవీ రానుంది. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్.. షాహిద్ కపూర్ లు నటిస్తుండగా.. ఇద్దరితోనూ శృంగారం ఒలికించే రోల్ లో కంగనా రనౌత్ నటిస్తోంది. ఇలాంటి సన్నివేశాలు చేయడం.. ఆన్ స్క్రీన్ ను వేడెక్కించడం ఈ అమ్మడికి కొత్తేమీ కాదు కానీ.. ఈ పీరియాడికల్ మూవీలో.. అది కూడా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఈ రొమాంటిక్ సీన్స్ అవసరమా అనే విమర్శలు వస్తున్నాయి.

ఏ టాపిక్ అయినా.. ఎలాంటి విమర్శ అయినా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఈ స్టేట్మెంట్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. యుద్ధం అంటే అందులో శృంగారం కూడా ఉండాలన్న ఈ భామ.. 'యుద్ధంలో శృంగారం కూడా ఒక కళ' అంటూ అందరి నోళ్లు మూయించేసింది. రంగూన్ మూవీలో కంగనా హాఫ్ న్యూడ్ గానూ.. న్యూడ్ గానూ నటించేసిందని అనిపించేలా కొన్ని సీన్స్.. ఈ చర్చకు అసలు కారణం.

అయితే.. ఈ స్టేట్మెంట్లను రంగూన్ మూవీకి పబ్లిసిటీ కోసం చేస్తున్నవే అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఫిబ్రవరి 24న రంగూన్ మూవీ రిలీజ్ కానుండగా.. ఈ సినిమాకి కంగనా చేసిన హాట్ సీన్స్ ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం అక్కర్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/