30 కోట్ల ప్యారడైజ్ రెడీ!!

Fri Jan 12 2018 23:00:36 GMT+0530 (IST)

స్టార్ హీరోయిన్స్ కి ఈ మధ్య కాలంలో రెమ్యునరేషన్స్ చాలా గట్టిగా అందుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సినిమాలకు హీరోలతో సమానంగా అందుకుంటున్నారు. దీంతో భామలు దీపం ఉన్నపుడే ఇల్లును చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములాను బాగా వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ కాంట్రవర్సియల్ బ్యూటీ కంగనా రనౌత్ మంచి ప్లేస్ లో ఇల్లును సెట్ చేసేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఎప్పుడు చల్లగా ఉండే మనాలి ప్రదేశంలో అమ్మడు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేసి ఎంతో ఇష్టంగా నిర్మించుకుంది. అసలైతే స్థలాన్ని కంగాన 2013 క్వీన్ సినిమా రిలీజ్ అయినా తరువాత కొనుక్కుంది. ఎప్పటి నుంచో అక్కడి ఇంటి ప్లాన్ కోసం స్పెషల్ ఆర్కిటెక్చర్స్ తో కలిసి మీటింగ్ లు కూడా పెట్టింది. చాలా సమావేశ తరువాత గాని వర్క్ స్టార్ కాలేదు. ఇక లేటెస్ట్ గా ఐడియాలను తన ఇష్టాలను జత చేసి అందంగా ఇంటిని డెకరేట్ చేయించుకుంది.

మొత్తంగా ఆ ఇంటిలో ఎనిమిది బెడ్ రూమ్ లు ఉన్నాయట. ప్రతి రూమ్ లో మౌంటైన్స్ కనిపించే విధంగా స్పెషల్ విండో లను ఏర్పాటు చేసుకుందట. అంతే కాకుండా బాల్కనీ కూడా ఏర్పాటు చేసుకుంది. మొత్తానికి కంగాన 30 కోట్లతో తన ప్యారడైజ్ ను రెడీ చేసుకొని తన డ్రీమ్ హోమ్ తో కొత్త ఏడాదికి వెల్కమ్ పలికింది. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చారిత్రాత్మక కథలో నటిస్తోంది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.