వామ్మో కంగనా.. డైరెక్టుగా అన్ని మాటలే

Wed Sep 13 2017 10:51:13 GMT+0530 (IST)

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నేసి సెన్సేషన్స్ కు కేంద్రం అవుతుంది అని అడిగితే.. ఇంత అంటూ అంచనా వేసి ఓ కౌంట్ చెప్పడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలు.. వివాదాలు సృష్టించేయడం ఆమెకు చాలా ఈజీ. ఇప్పుడు మరో కొత్త రూట్ లో ఇలాంటి పనే చేసింది కంగనా.యూట్యూబ్ లో పాపులర్ ఛానల్ అయిన ఏఐబీతో కలిసి ది బాలీవుడ్ దివా సాంగ్ లో నటించింది కంగనా. ప్రస్తుతం రిలీజ్ కానున్న తన సిమ్రన్ మూవీకి ప్రచారానికి ఉపయోగపడేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మరీ ఈ పాట రిలీజ్ చేశారు. అయితే.. ఈ పాట పరమార్ధం మాత్రం చాలానే ఉంటుంది. "చిట్టియా కలైయా వే" పాటను రీరైట్ చేసి.. "కాజ్ ఐ హ్యావ్ వెజైనా రే" అంటూ మార్చేశారు. పల్లవిలోని ఈ ఒక్క లైన్ తోనే కంగనా ఏం చెప్పదలచుకుందో అర్ధమవుతుంది.

పాటలో ఆమె ఒక యాక్ట్రెస్ అయినా.. ఫిజిసిస్ట్ గా వర్క్ చేసే పాత్ర అన్నమాట. ఆమెను ఈ పాట పాడమంటే.. మొదట తిరస్కరించి.. ఆ తర్వాత పాడుతుంది. ఇక హీరో వస్తుంటే హారతి పళ్లేలతో స్వాగతాలు(కభీ ఖుషీ కభీ ఘమ్ లో సీన్)ను ఇమిటేట్ చేయడం.. దర్శకుడు హీరోకు భజన చేయడం వంటివి గమనిస్తే.. ఈ పాటలో నేరుగానే షారూక్ ఖాన్.. హృతిక్ రోషన్.. కరణ్ జోహార్ లను టార్గెట్ చేసిందని అర్ధమవుతుంది.

ఫిమేల్ లీడ్ అండే హీరోయిన్ ని దర్శకుడు గుర్తు పట్టకపోవడం.. లవ్ ఇంట్రెస్ట్ అంటేనే గుర్తుకు రావడం.. ఫెమినా జీ అంటూ పాటలో హీరో పలికించడం.. ఆ తర్వాత హీరో పేర్ల తర్వాత మా పేర్లు.. కానీ మా కంటే వాళ్ల చెక్కులలో ఎక్కువ సున్నాలు అంటూ కౌంటర్లు వేయడం.. ఇలా ఒక పాటలో ఎన్ని చేయచ్చో అన్నీ చేసేసింది కంగనా రనౌత్.

ఇక చివరలో పాట లైన్స్ ను కొంచెం ఛేంజ్ చేసి.. "యస్ ఐ హ్యావ్ వెజైనా రే" అంటూ పాడేసి.. మహిళల సాధికారత కూడా ప్రకటించేసింది కంగనా. క్లోజింగ్ లో 'ఈ పాట నేను రాయలేదు.. నిజంగా.. నమ్మండి. ఇది నా ఐడియా కాదు' అంటూ చెప్పి మరీ వెళ్లిపోతుంది కంగనా. క్వీన్ ఏం చెప్పిందో అర్ధమైంది కదా.