Begin typing your search above and press return to search.

క్వీన్ మెడకే కేసు చుట్టుకుంటుందా!?

By:  Tupaki Desk   |   21 March 2018 10:38 AM GMT
క్వీన్ మెడకే కేసు చుట్టుకుంటుందా!?
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు అటు యాక్టింగ్ పరంగాను.. ఇటు డేరింగ్ పరంగాను బోలెడంత గుర్తింపు ఉంది. వివాదాల విషయంలో కూడా ఈమె రియాక్ట్ అయ్యే తీరు మహా ఘాటుగా ఉంటుంది. గతేడాది హృతిక్ రోషన్ తో ఈమె వివాదం సంగతి తెలిసిందే. ఆ సమయంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిందనే ఆరోపణలు ఇప్పుడు ఈమె మెడకు చుట్టుకుంటున్నాయి. పోలీసులు.. కోర్టు అనుమతి లేకుండా ఓ వ్యక్తి కాల్ డేటా రికార్డులను సేకరించడం చట్ట విరుద్ధం.

కానీ హృతిక్ రోషన్ కాల్ డేటా రికార్డులను ఈమె సంపాదించిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. స్వయంగా థానే క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో.. ఇది పెద్ద కేసుగానే పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు వేరే కేసు గురించి విచారిస్తుంటే.. కంగనా పాత సంగతులు బయటకు వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ.. తన భార్యను అనుమానించి ఓ లాయర్ సహాయంతో కాల్ డేటా రికార్డులు పొందాడనే ఆరోపణలపై విచారిస్తోంది క్రైం బ్రాంచ్. దీంతోపాటు సాహిల్ ఖాన్ కాల్ డిటైల్స్ ను అయేషా ష్రాఫ్ సంపాదించిన వైనం పై కూడా విచారణ జరుగుతోంది.

ఈ వివాదం గురించి ఎంక్వైరీ చేస్తే.. రిజ్వాన్ అనే వ్యక్తి ద్వారా వీరంతా సీడీఆర్ ను సేకరించారు. కంగన నుంచి రిజ్వాన్ కు హృతిక్ ఫోన్ నెంబర్.. పేరు మెసేజ్ రూపంలో రావడాన్ని పసిగట్టిన పోలీసులు.. ఆమెకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాము ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కంగనా సోదరి రంగోళి చెబుతోంది.