తలైవి కోసం క్వీన్ రెమ్యూనరేషన్ వింటే షాకే!

Sun Mar 24 2019 17:11:40 GMT+0530 (IST)

క్వీన్ గా అందరిచేత పిలిపించుకునే కంగన రనౌత్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరు. రీసెంట్ గా 'మణికర్ణిక' చిత్రంలో విజయం సాధించిన తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 'మణికర్ణిక' తర్వాత కంగనా 'మెంటల్ హై క్యా'.. 'పంగా' అనే రెండు సినిమాలలో నటిస్తోంది.   'మెంటల్ హై క్యా' కు దర్శకుడు కే. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.   ఇక ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా జయలలిత బయోపిక్ 'తలైవి' లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు విష్ణు ఇందూరి ప్లాన్ చేస్తున్నారు. హిందీ.. తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాను ఇతర భారతీయ భాషలలో కూడా విడుదల చేస్తారట. కాకపోతే ఈ సినిమాకు కంగనా ఛార్జ్ చేసే రెమ్యూనరేషన్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది.  ఈ చిత్రంలో నటించేందుకు కంగనా రూ. 24 కోట్లు డిమాండ్ చేయగా నిర్మాత కూడా అందుకు ఒప్పుకున్నారట.  కంగనాకు ఉన్న స్టార్ ఇమేజ్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.100 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. పైగా జయలలిత బయోపిక్ అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారట.   

ఇప్పటికే ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు జయలలిత మేనల్లుడు దీపక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారట.  ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తాడు.  విజయేంద్ర ప్రసాద్ కథా పర్యవేక్షణ చేస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్. జీవి ప్రకాష్ సంగీత దర్శకుడు.  మదన్ కార్కీ సాహిత్యం అందిస్తాడట. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయట.