Begin typing your search above and press return to search.

పిచ్చెక్కించిన టాప్ హీరోయిన్ డ్రెస్

By:  Tupaki Desk   |   25 Sep 2016 11:30 AM GMT
పిచ్చెక్కించిన టాప్ హీరోయిన్ డ్రెస్
X
హీరోయిన్లు వేసుకునే ప్రతి డ్రెస్సుకూ ఓ లెక్కుంటుంది. నడుమందం చూపించాలంటే ఒకరకమైన డ్రెస్.. క్లీవేజ్ షో చేయాలంటే ఇంకో రకమైన డ్రెస్.. తొడ సౌందర్యం చూపించాలంటే మరో రకమైన డ్రెస్.. అలాగే బ్యాక్ అందాలతో కనువిందు చేయాలంటే మరో రకమైన డ్రెస్.

ఐతే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ వేసిన డ్రెస్ మాత్రం వీటన్నింటికీ భిన్నమైంది. ముందు నుంచి చూస్తే ఆమె చలి నుంచి కాపాడుకోవడానికి ఏదో వింటర్ వేర్ ట్రై చేసినట్లుంది అనుకుంటాం. కానీ వెనక్కి తిరిగి చూస్తే కానీ.. ఆ డ్రెస్సులో మహత్యం బోధపడదు. వెనుక భాగం మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించేసే ఈ డ్రెస్ చూస్తే మతిపోవడం ఖాయం. ఇలాంటి డ్రెస్సులతో కూడా ఇలా ఎక్స్ పోజింగ్ చేయొచ్చా అనిపించేలా చాలా వెరైటీగా డిజైన్ చేశారు ఈ డ్రెస్.

ఫ్యాషన్ విషయంలో మిగతా హీరోయిన్ల కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండే కంగనా.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ డ్రెస్ ఎలా ఉంది అన్నది పక్కనబెడితే.. కంగన ఏం చేసినా వెరైటీ అనే విషయం ఈ డ్రెస్ ద్వారా మరోసారి రుజువైంది.