Begin typing your search above and press return to search.

కంచె కోసం కళాదర్శకుడి కష్టం..

By:  Tupaki Desk   |   7 Oct 2015 12:30 PM GMT
కంచె కోసం కళాదర్శకుడి కష్టం..
X
కంచె.. ట్రైలర్ లోని విజువల్స్ తో దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది ఈ సినిమా. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపారు. అతి తక్కువ కాలంలో ఇలాంటి విజువల్స్ ను రాబట్టారంటే.. అందుకు డైరెక్టర్ ప్రతిభతోపాటు కళాదర్శకుడి నైపుణ్యం కీలకపాత్ర పోషిస్తుంది. కంచెకు సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. ఈ మూవీకోసం ఈయన చాలానే పరిశోధనలు చేశారు. "నేను ఉన్నత చదువులు చదవలేదు. అందుకే నాకు రెండో ప్రపంచయుద్ధం గురించి తెలీదు. ఇందుకోసం ఈ యుద్ధం కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలను 3-4 నెలలపాటు చూశాను."అంటున్నారు సాహి.

1930-40 ల నాటి లుక్ తీసుకురావడం ఎలా? ఇది చాలా టఫ్ క్వశ్చన్. అందుకే తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక సమీపంలో ఉన్న పేరేరు గ్రామాన్ని ఎంచుకున్నారు. పాతతరం నాటి దృశ్యాలను ఆవిష్కరించేందుకు ఈ గ్రామంలోని ఇళ్లన్నిటికీ రంగులు మార్చారు. ఇందుకు గ్రామస్తులు అందించిన సహకారం సూపర్ అంటారు సాహి. ప్రస్తుత కాలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు, సిమెంట్ తో కట్టిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ఇవేమీ కనిపించకుండా జాగ్రత్తలు పడ్డారు. జమీందార్ కూతురు అయిన హీరోయిన్ ఇంటి కోసం 40 లక్షలకుపైగా ఖర్చుపెట్టారట. బొగ్గుతో నడిచే రైలు, కంపార్ట్ మెంట్స్, ప్లాట్ ఫాంలు డిజైన్ చేయాల్సి వచ్చింది. ఇండియాతో పాటు జార్జియాలోనూ కంచె షూటింగ్ నిర్వహించారు.

అయితే.. సెట్స్ విషయానికొస్తే మెజారిటీ భాగం రామోజీ ఫిలింసిటీలోనే కంప్లీట్ చేశారు. రైల్ ఇంజిన్ తో సహా.. అన్నిటినీ ఏర్పాటు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉందని చెబ్తున్నారు సాహి సురేష్. ఆర్ట్ టీం ఇంతగా కష్టపడబట్టే.. కంచె విజువల్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా కనిపిస్తున్నాయి.