Begin typing your search above and press return to search.

రజని కన్నా లారెన్స్ ఎక్కువా ?

By:  Tupaki Desk   |   22 April 2019 12:01 PM GMT
రజని కన్నా లారెన్స్ ఎక్కువా ?
X
తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. విమర్శకులు ప్రేక్షకులు అందరూ ఒకే మాటగా ఏ మాత్రం కొత్తదనం లేని రొటీన్ హారర్ సినిమా అని కాంచన 3 గురించి తేల్చేసినా టికెట్ కౌంటర్ల దగ్గర మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమిళ తెలుగు వెర్షన్లు కలిపి కేవలం మూడు రోజులకే 50 కోట్ల గ్రాస్ దాటేసిన కాంచన 3 ఈజీగా పేటను క్రాస్ చేస్తుందని అక్కడి ట్రేడ్ అంచనా.

గత కొన్నేళ్లలో లారెన్స్ ఫాలోయింగ్ తమిళనాట విపరీతంగా పెరిగిపోయింది. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా కేవలం కామెడీ హారర్ సిరీస్ తోనే ఇంత రేంజ్ సంపాదించడం మాటలు కాదు. రొటీన్ అంశాలు ఎన్ని ఉన్నా అక్కడి మాస్ కు కావాల్సిన కామెడీ మసాలాలు బాగా దట్టించడంతో అతి ఎక్కువైనా ఆదరణ దక్కుతోంది

సో లారెన్స్ యధాలాపంగా అన్నా సీరియస్ గా అన్నా కాంచనల ప్రవాహం ఇప్పట్లో ఆగేలా లేదు. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ హక్కులు కొని పంపిణి చేసేందుకు ముందుకు వచ్చిందంటేనే ముని బ్రాండ్ అక్కడ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కాంచన పది భాగాలు తీస్తానన్న లారెన్స్ ఇచ్చిన మాటకు కట్టుబడేలా ఉన్నాడు.

అక్షయ్ కుమార్ హీరోగా కాంచన రెండో భాగం రీమేక్ త్వరలో అక్షయ్ కుమార్ హీరోగా ప్రారంభం కానుంది. ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్నప్పటికీ సూర్యవంశీ షూటింగ్ పూర్తి కాగానే లారెన్స్ దర్శకత్వంలోనే రీమేక్ మొదలుపెట్టనున్నారు. మొత్తానికి ఒకే ఫార్ములాతో మళ్ళి ,మళ్ళి అదే సినిమా తీస్తూ సక్సెస్ కొడుతున్న హీరో కం దర్శకుడు లారెన్స్ ఒక్కడే కాబోలు