హాట్ టాపిక్.. కమల్ ఘాటు ముద్దు

Tue Jun 12 2018 15:52:20 GMT+0530 (IST)

లోకనాయకుడు కమల్ హాసన్ నట కౌశలం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో ఆయనొకరు. నటుడిగా ఆయన్ని అందరూ అభిమానిస్తారు. ఐతే నటుడిగా కమల్ ఎంత గొప్ప ప్రతిభ చూపించినప్పటికీ.. ట్రెడిషనల్ గా ఉండే ప్రేక్షకులు ఆయన్ని ఓ విషయంలో వ్యతిరేకిస్తుంటారు. కమల్ కు ముద్దుల పిచ్చి అని.. సినిమాకు అవసరమైనా కాకపోయినా.. ఘాటు ముద్దుల కోసం వెంపర్లాడతాడని ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. తనతో పని చేసిన చాలామంది కథానాయికలతో ఆయన లిప్ లాక్ సీన్స్ చేశారు. ఇప్పుడు లిప్ లాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి కానీ.. కమల్ తొంభైలు.. అంతకంటే ముందే పెదవి ముద్దుల్ని పాపులర్ చేశాడు. నడి వయసులోకి వచ్చాక సైతం ఆయనకు ఆ ముద్దుల మోజు తీరలేదు.ఇప్పుడు 60 ఏళ్లు పైబడ్డాక  కూడా కమల్ లిప్ లాక్ వదలకపోవడం విశేషం. ఆయన కొత్త సినిమా ‘విశ్వరూపం-2’లో ఘాటు లిప్ లాక్ ఉన్నట్లుంది. నిన్న రిలీజైన ట్రైలర్ ఆ దిశగా సంకేతాలు కనిపించాయి. హీరోయిన్ పూజా కుమార్ తో కమల్ ఘాటు ముద్దుకు రెడీ అవుతున్న షాట్ చూపించారు. ఇక్కడ చూపించింది ఒక చిన్న షాటే అయినా.. ఆ ముద్దు ఎంత ఘాటుగా ఉండబోతోందో అర్థమైపోయింది. ట్రైలర్లో ఇంకా చాలా విశేషాలున్నప్పటికీ.. కుర్రాళ్ల దృష్టి ఇక్కడే ఆగిపోయింది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ వయసులో కమల్ కు ఇంకా ఈ మోజేంటని కొందరంటే.. ఆయనెప్పుడూ రొమాంటిక్కే అని ఇంకొందరంటున్నారు. హాలీవుడ్లో నడి వయసు హీరోలు కూడా ఇలాంటి ముద్దు సీన్లు చేయడం కామన్ అని.. ‘విశ్వరూపం-2’ లాంటి ఇంటర్నేషనల్ రేంజ్ మూవీలో అదేమంత పెద్ద విషయం కాదని కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. మొత్తానికి ట్రైలర్లోని ఆ షాట్ సోషల్ మీడియాలో సినిమాకు మంచి ప్రచారమే తెచ్చి పెడుతోంది.