పిలిచి భోజనం పెట్టిన యూనివర్సల్ స్టార్

Thu Dec 06 2018 17:30:08 GMT+0530 (IST)

లోక నాయకుడు కమల్ హాసన్ సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే ఒక గ్రంధం సరిపోదేమో. ఒక నటుడి గా ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకే స్టార్ హీరో చేయలేదనడం అతిశయోక్తి కాదు. కాకపోతే ఆయన వ్యక్తిత్వం గురించి మాత్రం అతి కొద్దిమందికే తెలుసు. ఆ మధ్య గౌతమితో లివిన్ రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకున్న కమల్ ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తున్నాడు. బిగ్ బాస్ 2 ను విజయవంతంగా పూర్తి చేసాక మూడో సీజన్ కూడా ఆయనతోనే చేయించాలని సదరు టీవీ ఛానల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.ఇదిలా ఉండగా కమల్ హాసన్ ఒక అప్ కమింగ్ యాక్టర్ ని ఇంటికి భోజనానికి పిలిచి మరీ ఘనంగా సన్మానించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. విషయానికి వస్తే సుజా వరుని అప్ కమింగ్ హీరోయిన్. మనకు అంతగా పరిచయం లేదు కానీ పెన్సిల్-కుట్ర 23 లాంటి సినిమాల్లో తనను చూడవచ్చు. తమిళ్ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ కూడా. ఇటీవలే సుజి పెళ్లి జరిగింది. ఫిలిం మేకర్ శివ కుమార్ ను పెళ్లి చేసుకుంది. బిగ్ బాస్ 2 లో ఉన్నప్పుడే సుజి వరుని తనకు పెళ్లంటూ జరిగితే నాన్న లేని లోటు తీరేలా కమల్ హాసన్ దగ్గరుండి జరిపించాలని కోరుకుంది.

కానీ ఇతరత్రా కారణాల వల్ల కమల్ పెళ్ళి కి అటెండ్ కాలేకపోయాడు. దాంతో నూతన దంపతులను ఇంటికి పిలిచి రుచికరమైన షడ్రసోపేతమైన భోజనం పెట్టి నూతన దంపతులను సత్కరించి పంపాడు. సుజి కి ఇచ్చిన మాట మేరకు కమల్ తీర్చుకునే అవకాశాన్ని ఇలా తీసుకున్నాడు. కమల్ ఇలా పర్సనల్ గా భోజనానికి పిలవడం చాలా అరుదని సుజి వరుని ఆ రకంగా భలే ఛాన్స్ కొట్టేసిందని స్నేహితులు మోసేస్తున్నారు. శంకర్ తీయబోయే ఇండియన్ 2 కోసం కమల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది

TAGS: