కమల్ కి పొలిటికల్ 'కళ' వచ్చిందే..

Thu Oct 12 2017 23:24:16 GMT+0530 (IST)

సినిమా హీరోలు రాజకీయ నాయకులుగా సినిమాలో కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా సౌత్ హీరోలు పంచె కట్టులో సూపర్బ్ గా ఉంటారని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో లో అయితే లుంగి స్టైల్ లకు చాలా పాపులార్టీ ఉంది. రాజకీయ నాయకులు ఎక్కువగా లుంగీలతోనే దర్శనం ఇస్తారు. సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా అక్కడ లుంగీలోనే ఉంటారు.ఇక సినిమాలో అభిమానులను మెప్పించేందుకు కోలీవుడ్ హీరోలు కూడా ఒక్క సిన్ లో అయినా లుంగీలో కనిపిస్తారు. కోలీవుడ్ స్టైల్ ని బాలీవుడ్ లో షారుక్ కూడా లుంగీ డ్యాన్స్ అని తన సినిమాకి వాడుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళ హీరోలే రాజకీయాల్లోకి వెళితే లుంగీ లో తప్పకుండా కనిపించాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ - రజినీకాంత్ వంటి వారు రాజకీయాల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ త్వరలోనే పార్టీని స్టార్ట్ చేయడానికి సిద్దమయ్యాడు. తమిళ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్ లేటెస్ట్ గా లుంగీలో కనిపించాడు. రాజకీయ నాయకుడిగా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సాధారణ జనాలను ఆకట్టుకోవాలంటే లుంగీలో కనిపించాల్సిందే అని కమల్ ఈ ఫోటో షూట్ చేయించుకుని ఉంటాడు.

అయితే కేవలం లుంగీల్లో కనిపించినంత మాత్రాన ఓట్లు పడతాయా? జనాలు ఆధరిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో తమిళ పొలిటికల్ స్ర్కీన్ పై!!