Begin typing your search above and press return to search.

సన్నజాజి పడక.. లెటజ్‌ రీమిక్స్‌

By:  Tupaki Desk   |   2 Sep 2015 5:23 AM GMT
సన్నజాజి పడక.. లెటజ్‌ రీమిక్స్‌
X
రీసెంట్‌ టైమ్స్‌ లో సైజ్‌ జీరో మూవీ హాట్‌ టాపిక్‌. అనుష్క బొద్దుగుమ్మ అవతారంలో చేస్తున్న హల్‌ చల్‌ అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ట్రైలర్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. స్వీటీ ఏంటి? అంత లావు ఎలా అయిపోయింది? అంటూ అమ్మాయిలంతా క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ తో అలాగే ఉండిపోయారు. వీళ్లందరికీ క్లారిటీ రావాలంటే ఈ సినిమా రిలీజైతేనే సాధ్యం. అనుష్క ఎందుకు బొద్దుగుమ్మలా ఉంది? ఎందుకు సైజ్‌ జీరోకి మారాలనుకుంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

పదిహేను రోజులుగా ఈ సినిమా ప్రచారంలో స్పీడ్‌ చూస్తుంటే ఈసారి ప్రకాష్‌ కోవెలమూడి ష్యూర్‌ షాట్‌ హిట్‌ కొట్టేట్టే ఉన్నాడు. అందులో భాగంతో ఈ సినిమాలో ఓ సర్‌ ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ ఉందంటూ ఊరించారిన్నాళ్లు. ఇప్పటికి ఆ సీక్రెట్‌ గుట్టు విప్పాడు. సన్నజాజి పడక .. అంటూ ఓ రీమిక్స్‌ సాంగ్‌ అదరగొట్టేస్తుందనే చెబుతున్నారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, రేవతి జంటగా నటించిన క్షత్రియ పుత్రుడు చిత్రంలోని సన్నజాజి పడక పాటను రీమిక్స్‌ చేశారు. ఆర్య, అనుష్క జంట టీవీ చూస్తూ ఆ పాటలోని క్యారెక్టర్ల లోకి పరకాయం చేస్తారట. ఇమాజినేషన్‌ లో సాంగ్‌ అన్నమాట!

ఇటీవలి కాలంలో రీమిక్స్‌ సాంగ్స్‌ బాగానే హిట్‌ కొడుతున్నాయి. బంగారు కోడి పెట్ట (మగధీర), శుభలేక రాసుకున్నా (నాయక్‌).. బందరు లడ్డు తినిపిస్తాను బరిలోకొస్తావా (పటాస్‌).. ఈ పాటల్లానే సన్నజాజి (సైజ్‌ జీరో)పాట హిట్‌ కొడుతుందేమో చూడాలి.