Begin typing your search above and press return to search.

నాలుగు దశాబ్దాల కెరీర్‌ కు గుడ్‌ బై

By:  Tupaki Desk   |   5 Dec 2018 11:17 AM GMT
నాలుగు దశాబ్దాల కెరీర్‌ కు గుడ్‌ బై
X
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి యూనివర్శిల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న కమల్‌ హాసన్‌ తన సినీ ప్రస్థానంకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కమల్‌ హాసన్‌ కొన్నాళ్ల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెల్సిందే. తమిళనాట క్రియాశీలక రాజకీయ నాయకుడిగా మారేందుకు లోక నాయకుడు తన కథానాయకుడి పాత్రను ముగించాలని నిర్ణయించుకున్నాడు. మహానాయకుడి పాత్రను పూర్తి స్థాయిలో నెత్తికి ఎత్తుకునే సమయం ఆసన్నమైందని ప్రకటించాడు.

కమల్‌ త్వరలో ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని చేయబోతున్నాడు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ గా ఈ చిత్రం శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. విభిన్నమైన కథాంశంతో, కమల్‌ రాజకీయ ఇమేజ్‌ ను పెంచే విధంగా ఆ చిత్రం ఉంటుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇండియన్‌ 2 చిత్రంతో తన సినీ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్తే అర్థం పరమార్థం ఉంటుందనే అభిప్రాయంలో కమల్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పార్టీని ప్రకటించిన కమల్‌ హాసన్‌ 2019 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత ఏడాది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్‌ అవ్వాలని, లేదంటే కనీసం కింగ్‌ మేకర్‌ అయిన అవ్వాలనేది కమల్‌ కోరిక. అందుకే ఇప్పటి నుండే పూర్తి రాజకీయాల్లోకి వెళ్లాలని కమల్‌ భావిస్తున్నాడు. అందుకు సినిమాల్లో ఉంటే సాధ్యం కాదని ఇండియన్‌ 2 చిత్రం తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా కమల్‌ ఒక ప్రకటనలో తెలియజేశాడు. డిసెంబర్‌ 14న సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. కాజల్‌ హీరోయిన్‌ గా నటించబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో అంటే తమిళనాడు ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.