సినిమాలో పార్టీ గురించి ఏమీ లేదట

Wed Jun 13 2018 07:00:01 GMT+0530 (IST)

కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో తన నట విశ్వరూపం చూపించిన కమల్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్లో కూడా అలరించబోతున్నాడు. ఈ సినిమా తాలూకు ట్రైలర్ ఈ మధ్యనే విడుదల కాగా.. మొదటి పార్టుకు ఏమాత్రం తీసిపోని యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలుస్తూనే ఉంది.సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా కమల్ తన ప్రతిభ చూపుతున్నారు. 'మక్కల్ నీది మయం' అన్న పేరుతో తనకంటూ సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో బిజీ గా గడుపుతున్నాడు ఈ 'దశావతారాం' హీరో. ఇప్పుడు విశ్వరూపం 2 విషయంలో అందరికి కామన్ గా వచ్చే సందేహం ఏంటి అంటే ఇందులో రాజకీయాల గురించి కానీ తన పార్టీని గురించి కానీ ఏమైనా సన్నివేశాలు ఉంటాయా అని. ఇదే విషయం అడిగితే అలాంటిది ఏమి లేదు. ఒక యాక్షన్ థ్రిల్లర్ గానే మీ ముందుకు వస్తుంది అని సందేహాలు క్లియర్ చేసాడు కమల్. అంటే సినిమాను కేవలం ఒక మేకర్ గా మాత్రమే రూపొందించాడనమాట.

విశ్వరూపం 2 కాకుండా భారతీయుడు 2 కూడా కమల్ చేతిలో ఉంది. సూపర్ హిట్ సినిమా భారతీయుడు కు సీక్వెల్ గా రూపు దిద్దుకోనున్న చిత్రమిది. ఈ సినిమా మాత్రం మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది అని. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తున్నట్టుగానే సినిమా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుస్తోంది.