Begin typing your search above and press return to search.

అఫీషియల్: కమల్ సినిమాలో విక్రమ్

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:17 AM GMT
అఫీషియల్: కమల్ సినిమాలో విక్రమ్
X
ఇండియాలో నిన్నటి తరం గొప్ప నటుల్లో కమల్ హాసన్ ఒకడు. ఆయన తర్వాతి తరంలో ఆ స్థాయిలో విలక్షణమైన పాత్రలతో పేరు సంపాదించిన నటుడు విక్రమ్. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోంది. ఐతే వీళ్లిద్దరూ కలిసి నటించట్లేదు. కమల్ నిర్మించే సినిమాలో విక్రమ్ హీరోగా కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల కిందటే ఈ ప్రాజెక్టు గురించి న్యూస్ బయటికి రాగా.. ఇప్పుడు అఫీషియల్ న్యూసే వచ్చేసింది.

స్వయంగా కమల్ హాసనే ఈ ప్రాజెక్టు గురించి ట్విట్టర్లో ప్రకటించాడు. కమల్ లాంగ్ టైం అసోసియేట్.. ఆయనతో ‘చీకటి రాజ్యం’ తీసిన రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతుతండటం విశేషం. ‘చీకటి రాజ్యం’ తరహాలోనే ఇది కూడా ఒక థ్రిల్లర్ మూవీనేనట. ఇది కూడా ఓ ఫ్రెంచ్ మూవీ ఆధారంగానే తెరకెక్కుతుందట.

త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. విక్రమ్ ఈ సంక్రాంతికి తమిళంలో ‘స్కెచ్’ సినిమాతో పలకరించాడు. అతను గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తి కాగానే కమల్ ప్రాజెక్టులోకి వస్తాడు. మరోవైపు కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం-2’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఆ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.