Begin typing your search above and press return to search.

ఇదేం బర్త్ డే విష్ బాబోయ్!

By:  Tupaki Desk   |   22 May 2019 7:07 AM GMT
ఇదేం బర్త్ డే విష్ బాబోయ్!
X
కమాల్ ఆర్ ఖాన్ పేరు దాదాపుగా అందరూ వినే ఉంటారు. సెలబ్రిటీలను తిట్టడం.. అన్ని సినిమాలపై నోటికొచ్చినట్టుగా కామెంట్స్ చేయడం.. పిచ్చ రివ్యూలు ఇవ్వడంతో అయన చాలా అన్ పాపులర్ అయ్యాడు. ఇక సౌత్ హీరోల మీద చెత్త కామెంట్లు చేసి సదరు హీరోల అభిమానుల చేత తిట్లు తిన్నాడు. ఇవన్నీ ఆయనకు చాలా చాలా కామన్. ఇలా చేసే ఆయన ఈమధ్య తన ట్విట్టర్ ఖాతాకు 5 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో చాలామంది పెద్ద హీరోలకు కూడా ఈ ఫాలోయింగ్ లేదు!

అది సరే.. ఇప్పుడు ఈ కమాల్ ఖాన్ గొడవ మనకెందుకు అంటే ఈరోజు అయన ఒక బర్త్ డే విష్ చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ సుజయ్ ఘోష్ కు తనివితీరా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అందరూ తెలిపే జన్మదిన్ ముబారక్ వేరు.. ఈ కమాల్ ఖాన్ ముబారక్ వేరు! ఆయన మాటలలోనే.. అయన ట్వీట్ లోనే చూడండి "సుజయ్ ఘోష్ సర్.. మీరో పెద్ద ఫ్లాప్ డైరెక్టర్.. మీరు బాలీవుడ్ లోనే అతి పెద్ద దొంగ డైరెక్టర్. ఫారెన్ సినిమాలనుంచి మీ సినిమాల్లోకి సీన్ టూ సీన్.. ఫ్రేం టు ఫ్రేం.. డైలాగ్ టు డైలాగ్ మక్కికి మక్కీ కాపీ కొడతారు. కానీ.. మీకు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరిలానే కాపీ కొడుతూ ఉండండి సార్.."

కమాల్ ఖాన్ ఏదో అన్నాడని సుజయ్ ఘోష్ మరీ అల్లాటప్పా డైరెక్టర్ అని ఫిక్స్ అయి పోకండి.. సుజయ్ ఘోష్ చాలా హిట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించాడు. 'ఝంకార్ బీట్స్'... 'కహాని'.. 'బద్లా' లాంటివి అయన ఫిల్మోగ్రఫీ లో ఉన్నాయి. అయినా ఇలాంటి బర్త్ డే విష్ ను ప్రపంచంలో ఎవరూ అందుకొని ఉండరు. దీనికి కామెంట్స్ కూడా అదిరిపోయాయి. ఒకరు.. "నీ బర్త్ డే విషెస్ కు ఆయన కోమాలోకి పోతాడు" అన్నారు. మరొకరు "ఇలాంటి ఖతర్నాక్ బర్త్ డే విష్ నేను మొదటి సారి చూస్తున్నా' అన్నారు. మరొకరికి ఫుల్ గా కాలినట్టుంది.. అందుకే "బోషడీకే.. ఇలా ఎవరైనా విష్ చేస్తార్రా" అంటూ మండి పడ్డారు.