'118'కు అన్న అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకునేవాడా?

Sat Feb 16 2019 18:56:41 GMT+0530 (IST)

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుసగా చిత్రాలు చేస్తూ సక్సెస్ ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తమ్ముడు ఎన్టీఆర్ పుషప్ ఇచ్చినా కూడా కళ్యాణ్ రామ్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. తాజాగా కళ్యాణ్ రామ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన '118' చిత్రంలో నటించాడు. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 118 ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు హిట్ ఇస్తుందేమో అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కథ విన్నప్పుడు ఎన్టీఆర్ తో చేస్తే బాగుంటుందని భావించాను అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.నాకు ఈ కథ వినిపించిన వెంటనే కథలో హీరో పాత్రకు తమ్ముడు ఎన్టీఆర్ ను ఊహించుకున్నాను ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నాను - నాకు ఈ కథ బాగా నచ్చింది. మరో హీరో సంగతి ఏమో కాని నేను మాత్రం ఎన్టీఆర్ తో ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాను.  అయితే నిర్మాత మహేష్ గారు ఈ కథతో నాతోనే సినిమా తీయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. దాంతో కథ నాకు కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఇలాంటి థ్రిల్లర్ నేపథ్యంలోని కథలతో సినిమాలు చేసింది లేదు. మరి అన్న అడిగినంత మాత్రాన '118'కు ఎన్టీఆర్ ఒప్పుకునేవాడా అనేది అనుమానమే. అన్న బ్యానర్ లో ఒక సినిమాను అయితే చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఎన్టీఆర్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాను చేసేందుకు ఒప్పుకునేవాడా అనేది అనుమానమే. ప్రస్తుతం జక్కన్న మల్టీస్టారర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.