Begin typing your search above and press return to search.

పూరీ హీరో ప్యాకులు చూపిస్తాడంట

By:  Tupaki Desk   |   23 July 2016 5:38 AM GMT
పూరీ హీరో ప్యాకులు చూపిస్తాడంట
X
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో ఇజం తెరకెక్కుతోంది. ఈ మూవీని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తుండగా.. సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇజంలో కళ్యాణ్ రామ్ లుక్ ని రిలీజ్ చేసేనప్పుడు.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ లుక్ లో ఓ విషయాన్ని దాచిపెట్టేశారనే విషయం ఇప్పడు బయటపడింది. అదే.. కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్. ఆ ఫోటో విడుదల చేసే నాటికే పర్ఫెక్ట్ బాడీతో ఉన్నాడట ఈ పూరీ హీరో. త్వరలో ఆ లుక్ ని లాంఛ్ చేయబోతున్నట్లు చెప్పాడు. దీని కోసం నాలుగు నెలలు కష్టపడ్డాడట. ఇప్పుడు తాను ఏ జీన్స్ కావాలంటే ఆ జీన్స్ వేసుకునేంత ఫిట్ గా ఉన్నానని అంటున్నాడు.

అయితే 11 కిలోల బరువు తగ్గిన తరువాత తన ఆరేళ్ల కూతురు అద్వైత.. ఎముకలు గుచ్చుకుంటున్నాయని కంప్లైంట్ చేసిందని చెప్పిన కళ్యాణ్ రామా.. 10ఏళ్ల కొడుకు శౌర్య మాత్రం ఆశ్యర్యపోయాడని అన్నాడు. రీసెంట్ గా తన మూవీ తొలిచూపులోనే చూస్తూ.. 'ఏంటి డాడీ అప్పుడంత లావుగా ఉన్నావ్.. ఇప్పుడే బాగున్నావ్. మళ్లీ అలా మారిపోకు' అనికూడా సలహా ఇచ్చాడట. మొత్తానికి నందమూరి హీరో ప్యాకులు చూపించడం అయితే ఖాయం.