Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ తో పూరీ.. మరో టెంపర్!!

By:  Tupaki Desk   |   29 April 2016 9:32 AM GMT
కళ్యాణ్ రామ్ తో పూరీ.. మరో టెంపర్!!
X
పూరీ జగన్నాథ్ - కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ మూవీకి ఓకే అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి ముహూర్తం షాట్ తీసేశారు. అధికారికంగా ఈ మూవీని స్టార్ట్ చేసేశారు యూనిట్. హైద్రాబాద్ లో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి.. కళ్యాణ్ రామ్ - పూరీ జగన్నాథ్ లతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

నందమూరి హరికృష్ణ - రామకృష్ణలతోపాటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ కూడా.. కళ్యాణ్ రామ్ మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. పూరీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో చాలా ఆసక్తి నెలకొంది. జ్యోతి లక్ష్మి - లోఫర్ సినిమాలు నిరుత్సాహపరిచిన తర్వాత పూరీ చేస్తున్న పిక్చర్ కావడంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిలో ఉన్నాడు పూరీ అంటున్నారు. కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించే ఈ చిత్రం.. సామాజిక కోణంలో ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో టెంపర్ మాదిరిగి గా సమాజంలో ఉన్న సమస్యనే స్టోరీగా రాసుకున్నాడని అంటున్నారు.

సమాజంలో ఉన్న ఓ సమస్యను బేస్ గా తీసుకుని.. పూరీ రాసిన పవర్ ఫుల్ స్టోరీ సూపర్బ్ గా ఉందనే టాక్ ఉంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టెయినర్ గా రూపొందించనున్నాడు పూరీ. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఫైనల్ అయిపోగా.. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.