మీసం లేకుండా మెచ్చిన వైఫ్

Thu Jun 14 2018 09:48:56 GMT+0530 (IST)

సాధారణంగా హీరోలు కెరీర్ మొదట్లో రొమాంటిక్ మూవీస్ చేస్తారు. సీనియారిటీ - ఇమేజ్ పెరిగిన కొద్దీ కమర్షియల్ ఎంటర్ టెయినర్లు.. మాస్ మసాలా మూవీస్ చేసుకుంటూ వస్తారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంలో రివర్స్ గేర్ లో వెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో యాక్షన్ మూవీస్ తో హిట్లు కొట్టిన ఈ హీరో చాలా ఏళ్లకు రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా జయేంద్ర డైరెక్షన్ లో నానువ్వే ప్రేక్షకుల ముందుకొచ్చింది.నానువ్వే సినిమా కోసం కళ్యాణ్ రామ్ టోటల్ గా లుక్ మార్చేశాడు. మీసం తీసేసి మంచి ఫిజిక్ తో అట్రాక్టివ్ గెటప్ లో కనిపించాడు. ‘‘కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం మీసం తీసేసి కనిపించాలని చెప్పినప్పుడు మొదట నా భార్య కాస్త అనుమానంగానే చూసింది. ఇప్పుడు నానువ్వే సినిమా నిర్మాణం పూర్తయి పోస్టర్లలో నా గెటప్ చూశాక తను చాలా హ్యాపీగా ఫీలయింది. నేను ఇప్పుడే బాగున్నానని చెబుతోంది’’ అంటూ కళ్యాణ్ రామ్ తన భార్య ఫీలింగ్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆఖరుకు కళ్యాణ్ రామ్ కుమారుడు కూడా మీసం లేకుండా చాలా హ్యాండ్ సమ్ గా కనిపించావంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడట. ఇలా భార్య.. కొడుకు ఇద్దరూ చాలా పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో తన లుక్ బాగా క్లిక్ అవుతుందని కళ్యాణ్ రామ్ ఆశపడుతున్నాడు. రొమాంటిక్ ఫిలిం చేయాలంటే మొదట నెర్వస్ గా ఫీలయ్యానని.. ఈ పాత్రలో అడ్జస్ట్ కావడానికి కాస్త టైం పట్టిందని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్.