నీటి రిస్కులో నందమూరి హీరో

Mon Dec 10 2018 14:06:01 GMT+0530 (IST)

ఒకప్పుడు సినిమాల్లో ఏవైనా రిస్కీ షాట్స్ ఉంటే హీరోలకు ప్రమాదం లేకుండా అనుభవజ్ఞులైన డూపులతో ఆ పనిని కానిచ్చేవారు దర్శకులు. కానీ ఇప్పుడు కాలం మారింది. తమ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కోసం నిజాయితీగా ఉండేందుకు హీరోలు చాలా సందర్భాల్లో డూప్ లేకుండా నేరుగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధ పడుతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం అలాంటి సాహసానికి ఒడిగడుతున్నాడు. గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 118 కోసం నీటి అడుగులో ఊపిరి తీసుకోకుండా కళ్యాణ్ రామ్ చేసిన సాహసాన్ని నిర్మాత మహేష్ కోనేరు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఇది చూసి షాక్ తిన్న అభిమానులు ఇలా సినిమా కోసం రిస్క్ తీసుకోవద్దని గ్రీన్ మ్యాట్ లాంటి విజువల్ ఎఫెక్ట్స్ సహాయం ఉండగా ఇలా చేసి ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో అర్థముంది. గత కొంత కాలంగా హరికృష్ణ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అది సినిమాకు సంబంధించినది అయినా సరే ఎలాంటి సాహసానికి ఆ ఫ్యామిలీ సభ్యులు చేయడానికి ఫ్యాన్స్ ఇష్టపడటం లేదు.

థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న 118 జనవరిలో విడుదల కానుంది. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ మూడో వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ ఈ ఏడాది రెండు ప్లాపుల తర్వాత చేస్తున్న మూవీగా దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు .దాని కోసమే ఇంత కష్టమూ. అయినా ఫైట్స్ లాంటివి అయితే ఓకే కానీ ఇలా మరీ నీటిలో దిగి సాహసాలు చేయడం గురించి మాత్రం కాస్త ఆలోచించుకుంటే బెటర్