Begin typing your search above and press return to search.

ఎంఎల్ ఏకు బెడ్ రెస్ట్ తప్పదు

By:  Tupaki Desk   |   17 March 2018 4:20 AM GMT
ఎంఎల్ ఏకు బెడ్ రెస్ట్ తప్పదు
X
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఏదన్నా పని మొదలెడితే కమిట్ మెంట్ తో కంప్లీట్ చేస్తాడనే పేరుంది. కానీ కొన్నిసార్లు ఎంత కమిట్ మెంట్ తో ప్రయత్నించినా కాలం కలిసిరాదు... శరీరం సహకరించదు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ సినిమా ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) కంప్లీట్ అయ్యే టైంలో ఓ నెలరోజులు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

ఎంఎల్ ఏ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమధ్య కళ్యాణ్ రామ్ మోచేతికి గాయమైంది. కానీ గాయం కారణంగా షూటింగ్ ఆగకూడదన్న ఉద్దేశంతో అలాగే కంటిన్యూ చేశాడు. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే సినిమా పూర్తి చేద్దామని పళ్ల బిగువన బాధ భరించి షూటింగుకు వచ్చాడు. కాకపోతే నొప్పి విపరీతంగా పెరిగిపోవడంతో డాక్టర్లు కచ్చితంగా నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని తెగేసి చెప్పారు. దీంతో ఎంఎల్ఏ షూటింగ్ కు ప్రస్తుతానికి విరామం ఇచ్చారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారిగా కళ్యాణ్ రామ్ సినిమా లక్ష్మీకళ్యాణంతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. మళ్లీ ఇన్నేళ్ల తరవాత వాళ్లిద్దరూ కలిసి ఎంఎల్ ఏ సినిమాలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ మూవీకి దర్శకుడు. ఎంఎల్ఏతో పాటు కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయిక.