Begin typing your search above and press return to search.

మేమంతా ఒక్కటే ఫ్యామిలీ - కళ్యాణ్‌ రామ్‌

By:  Tupaki Desk   |   10 Oct 2015 7:09 PM GMT
మేమంతా ఒక్కటే ఫ్యామిలీ - కళ్యాణ్‌ రామ్‌
X
''షేర్‌'' ఆడియో ఫంక్షన్‌ కార్యక్రమంలో.. కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతున్నంత సేపూ వెనుక 'జై బాలయ్య జై బాలయ్య' అంటూ నినాదాలు వినిపస్తూనే ఉన్నాయ్‌. దీనికి ధీటైన ఆన్సర్‌ కాదు కాని.. ఎమోషనల్‌ గా సమాధానం చెప్పాడు కళ్యాణ్‌ రామ్‌. ఒక విధంగా ఒక వర్గం అభిమానుల కళ్లు తెరిపించేశాడు.

''మేమందరం.. నందమూరి తారకరామారావు అనే వృక్షం నుంచే వచ్చాం. తాతగారి తరువాత మా బాబాయ్‌. ఆయన తరువాత మా నాన్నగారు. తరువాత అంతటి స్టార్‌ మా తమ్ముడు (జూ.ఎన్టీఆర్).. మేమందరం ఒకటే వంశం వృక్షం అండీ.. దయచేసి సెపరేట్‌ సెపరేట్‌ గా మాట్టాడకండి. ఇలాగే ఉంటాం. ఇట్సే ఫ్యామిలీ. మేమందరం ఒకటే. తాతగారు. బాబాయ్‌. నాన్నగారు. తమ్ముడు. రేపు మోక్షు. అభయ్‌ రామ్‌. నా కొడుకు కూడా వస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు వేరు వేరు చేసి మాట్టాడుతున్నారు? అలా చేయకండి ప్లీజ్‌. నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటే. అందరూ ఒకటిగా వెళదాం. ఒకటిగా ఉండటమే మన స్ర్టెంగ్త్‌. '' అని ముగించాడు కళ్యాణ్‌ రామ్‌.

పక్కనే ఉన్న తమ్మడు జూనియర్‌ కూడా ఎమోషనల్‌ గా క్లాప్సు కొడుతూ అన్నను అభినందిస్తూ.. అభిమానుల్లో ఇంకాస్త ఎనర్జీ నింపేశాడు. ఈ స్పీచ్‌ తో ఇక నినాదాలు అన్నీ ఆగిపోయాయ్‌ లే. ఏదేమైనా కళ్యాణ్‌ రామ్‌ లోని ఆ మెచ్చూర్డ్‌ క్యారెక్టర్‌ చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అందరినీ కలుపుగోలుగా తీసుకుపోయే ఆ స్వభావమే మనోడిలో ఇన్‌ బిల్ట్‌ ఎనర్జీ.

ఇక ఎన్టీఆర్‌ కూడా.. ''మా అన్నయ్య మాటే నా మాట.. ఆయన చెప్పిన ప్రతీ మాట వెనుకా నేనున్నాను'' అంటూ సెలవిచ్చాడు. శభాష్‌ నందమూరి బ్రదర్స్‌. ఇరగదీశారుపోండి!!